చైనాలో మిడతల దండుపై బాతు దళాల దండయాత్ర!

కొన్నినెలల క్రితమే పాకిస్థాన్ నుంచి మిలియన్ల మిడతల దండు భారత్ పై దండెత్తి వేలాది పంటలను నాశనం చేశాయి. ఇప్పడు ఇదే పరిస్థితి పొరుగు దేశమైన చైనాకు ఎదురైంది. ఒకవైపు కరోనా దెబ్బ నుంచి ఇంకా పూర్తిగా బయటపడనే లేదు.. మిడతల దండుతో డ్రాగన్ దేశానికి ఇప్పుడు పెద్ద కష్టమెచ్చి పడింది. మిడతల దండును ఎలా కంట్రోల్ చేయాలో పాలుపోక అయోమయంలో పడిపోయింది. బాంబులతోనో, తుపాకులతో బెదిరిపోయేవి కాదు ఆ మిడతల దండు. ఉగ్రవాదులయితే ఆర్మీ సైన్యంతో మట్టుపెట్టించొచ్చు. కానీ, వచ్చింది మిడతల దండు.. ఏం చేయాలో పాలు పోలేదు. పాకిస్థాన్, భారత్ కలిసే సరిహద్దుకు సమీపంలో 400 బిలియన్ల మిడతల దండు తిష్టవేశాయి.
కరోనా వైరస్ దెబ్బతో వారం రోజుల్లో ఆస్పత్రి నిర్మించిన ఘనతను చాటుకున్న చైనా.. ఇక లాభం లేదు అనుకుంది… మిడతల భరతం పట్టాల్సిందనే గట్టిగా నిశ్చయించుకుంది. అందుకే చైనా అసాధారణమైన ఆయుధాన్ని మిడతలపై ప్రయోగించింది. లక్ష బాతుల ఆర్మీ సైన్యాన్ని దేశసరిహద్దుకు పంపింది. మిడతల పనిపట్టాలంటే బాతులే కరెక్ట్ అని భావించిన చైనా అధికారులు ఈ దిశగా నిర్ణయం తీసుకున్నారు.
దేశ సరిహద్దు వైపు ఉన్న మిడతల దండుపై దాడిచేసేందుకు బాతుల దండు బయల్దేరింది. దీనికి సంబంధించిన వీడియోను చైనా ప్రభుత్వం వార్తా వెబ్ సైట్ సిజిటిఎన్ విడుదల చేసింది. పాక్, భారత్ సరిహద్దును కలిపే ప్రాంతానికి సమీపంలో చేరిన 400 బిలియన్ల మిడతలను అంతం చేసేందుకు లక్ష బాతుల సైన్యం రోడ్డుపైకి వస్తున్న దృశ్యాన్ని వీడియోలో చూడొచ్చు. ఈ లక్షల బాతుల సైన్యంలో ప్రతి బాతు నాలుగు చదరపు మీటర్ల భూమిని నియంత్రించగలవు. అంతేకాదు.. అదే సమయంలతో మిడతల దండుపై దాడి చేసివాటిని తినవచ్చు.
మిడుత సమూహాలను ఎదుర్కోవటానికి చైనా ఇలాంటి బాతు దళాలను ప్రయోగించడం ఇదే తొలిసారి కాదు.. జూన్ 2018లో, పొడి వాతావరణ పరిస్థితులను కలిగి ఉన్న దేశంలోని జిన్జియాంగ్ ప్రాంతంలో మిడుతలు దండెత్తాయి. అప్పుడు కీటకాలను తినే 1,000 బాతులను అధికారులు విడుదల చేశారు. ఆ బాతుల దండు మిడతలపై దండెత్తాయి. కనిపించిన ప్రతిమిడతను నోటకరిచి తినేశాయి.
అంతేకాదు.. చైనాలో మిడతలకు ఫుల్ డిమాండ్ ఎక్కువ. మిడతలను అక్కడివారు ఎంతో ఇష్టంగా తింటారు. సాధారణంగా చైనాలో ఇలాంటి కీటకాలను తినడం చాలా కామన్. చైనాలో పంటలపై మిడతలు దాడి చేసినప్పుడు అక్కడి రైతులు మీ మిడతలను పట్టి మార్కెట్లో విక్రయిస్తుంటారు. మిడుత దాడులకు కారణమయ్యే వాతావరణ మార్పు కొనసాగుతున్న మిడతల దండయాత్ర మధ్యప్రాచ్యంలో ఉద్భవించింది.
మే 2018లో తుఫాను ప్రభావంతో సౌదీ అరేబియా, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్లలో విస్తరించి ఉన్న శుష్క ఎడారిలోని వివిధ ప్రాంతాలలో వర్షపు నీరు వచ్చి చేరింది. ఫలితంగా ఇది ఎడారి మిడతలకు అనుకూలమైన సంతానోత్పత్తి పరిస్థితులను సృష్టించింది. అదే సంవత్సరం అక్టోబర్ నెలలో, అరేబియా ద్వీపకల్పంలో లుబాన్ తుఫాను కూడా భారీగా దెబ్బతీసింది. ఇది మిడుతలు పెంపకానికి మరింత అనుకూలమైన పరిస్థితులను సృష్టించింది.
ఆహారం కోసం.. ఈ మిడుతలు సరిహద్దుల మీదుగా ఎగురుకుంటూ వచ్చి పచ్చని పొలాలపై పడి పంటలను నాశనం చేస్తుంటాయి. ఇప్పటికే పాకిస్థాన్ నుంచి భారత్ పైకి దండెత్తి వచ్చిన కొన్ని మిడతల దండు గుజరాత్‌లోని వేలాది పంటలను నాశనం చేశాయి. ఇప్పుడు అక్కడి నుంచి చైనా మీదుగా మిడతల దండు దండెత్తుతోంది. మిడత దాడులతో ఇండియాలో 1.68 లక్షల హెక్టార్లకు పైగా భూములు దెబ్బతిన్నాయి. రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.