Dedication to work..టాయిలెట్ గుంతలో నీరు తాగిన ఉద్యోగిని..

  • Published By: nagamani ,Published On : October 16, 2020 / 03:39 PM IST
Dedication to work..టాయిలెట్ గుంతలో నీరు తాగిన ఉద్యోగిని..

Updated On : October 16, 2020 / 3:58 PM IST

Chinese women drinks water from a toilet : చైనాలోని షాంగ్‌డాంగ్‌లో గల ఓ ఫెర్టిలైజర్ కంపెనీలో క్లీనర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ..తాను ఎంత శుభ్రంగా నీతి నిజాయితీతో పనిచేస్తున్నానో నిరూపించుకోవటానికి ఏకంగా టాయిలెట్ గుతంలో ఉండే నీరు తాగేసింది. తాను టాయిలెట్లను ఎంతో శుభ్రంగా ఉంచుతానని చెబుతూ.. ఓ చిన్న గ్లాసుని టాయిలెట్ గుంతలో ముంచి..ఆ నీటికి గటగటా తాగేసింది.


అలా టాయ్ లెట్ గుంతలో నీటిని మంచినీరులా తాగేస్తున్న ఆమెను చూసిన ఆమె బాస్ ఇతర సిబ్బంది షాకయ్యారు. అలాగే షాక్ అయి చూస్తుండిపోయారు. ఆ తరువాత ఆ నిజాయితీకీ..తనపనిమీద తనకు ఉండే నమ్మకానికి అందరూ చప్పట్లు కొట్టి ఆమె పనితీరును ప్రశంసించారు. ఆమె టాయ్ లెట్ లో వాటర్ తాగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


పనిలో బాస్‌లను మెప్పించేందుకు ఎంతో మంది ఉద్యోగులు ఎన్నో మార్గాలు అనుసరిస్తుంటారు. కొంతమంది పనిచేసినా.. చేయకపోయినా బాస్ లకు భజన చేస్తూ..తోటి ఉద్యోగుల మీద పితూరీలు చెబుతూ..తామెంతో కష్టపడి పనిచేసేస్తున్నామనేలా బిల్డప్ లిస్తూ బాస్ మెప్పు పొందే పనిలో ఉంటారు. మరికొందరు నిజాయతీగా పనిచేసి శభాష్ అనిపించుకుంటారు.



టాయ్ లెట్ గుంతలో నీరు తాగిన ఈ చైనీస్ మహిళ మూడో రకం.. తాను నిజాయతీగా పనిచేయడమే కాదు.. దాన్ని నిరూపించుకోడానికి ఇదిగో ఇలా చేసింది..అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తరువాత అందరి ప్రశంసలు పొందింది. చైనా సోషల్ మీడియా Weiboతోపాటు ట్విట్టర్, యూట్యూబ్‌లలో సైతం ఈ వీడియో వైరల్ అయి చక్కర్లు కొట్టేస్తోంది. ఆమె నిజాయితీకి నెటిజనులు భిన్నవిధాలుగా స్పందిస్తున్నారు.




ఆమె డెడికేషన్‌ను కొంతమంది మెచ్చుకుంటున్నారు.ఆ బాసులు కూడా కాస్త రుచి చూసి ఉంటే ఇంకా బాగుండేదని, ఆమె పనితీరును ఇంకా బాగా తెలుసుకునేవారనీ..అంటున్నారు. ఇంకొందరు మాత్రం అంత చేయాల్సిన పనిలేదని అంటున్నారు.
https://youtu.be/ilB6EworueA