కరోనా ఎక్కడ సోకుతుందేమోనని..శవాన్ని పట్టించుకోలేదు

  • Published By: madhu ,Published On : February 1, 2020 / 02:33 AM IST
కరోనా ఎక్కడ సోకుతుందేమోనని..శవాన్ని పట్టించుకోలేదు

Updated On : February 1, 2020 / 2:33 AM IST

ఓ శవం అక్కడ పడి ఉంది. అందరూ వెళుతున్నారే కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. అయ్యో..పాపం..అంటున్నారు..అక్కడకు వెళ్లే ధైర్యం చూపించడం లేదు. మృతదేహాం వద్దకు వెళితే..ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందనే భయం వారిలో నెలకొంది. ఏంటా భయం అనుకుంటున్నారా ? అదే కరోనా వైరస్. చైనాలో ఈ వైరస్ గడగడాలిస్తోంది. వందల సంఖ్యలో మృత్యువాత పడుతుండగా వేల సంఖ్యలో వైరస్ సోకిన వారున్నారు. 

చైనాలోని వుహాన్ వీధులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. రోడ్డు పక్కన ఓ డెడ్ బాడీ కనిపించింది. కానీ ఎవరు కూడా శవం దగ్గరకు వెళ్లడానికి సాహసించలేదు. గంటల తరబడి ఆ మృతదేహం అలానే ఉంది. పాపం చనిపోయింది ఎవరు ? తెలుసుకొనే ప్రయత్నాలు చేయలేదు. చాలా సేపటి తర్వాత పోలీసులు, వైద్య సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు.

అక్కడి నుంచి వెళుతున్న ఓ రిపోర్టర్ ఈ ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో ఈ విషయం బయటకు పొక్కింది. కరోనా భయం వల్లే తాము మృతదేహం వద్దకు వెళ్లలేకపోయామని స్థానికులు వెల్లడిస్తున్నారు. ఈ వైరస్‌తో చాలా మంది చనిపోతున్నారని, ఆ వ్యక్తి కూడా వైరస్ వల్లే చనిపోయాడని అనిపించిందంటున్నారు. ఒకవేళ దగ్గరకు వెళితే..వైరస్ తమకు సోకుతుందనే భయంతోనే తాము వెళ్లలేకపోయామని వెల్లడిస్తున్నారు. కానీ అతను ఎలా చనిపోయాడన్నది మాత్రం తెలియడం లేదు. ఫోరెన్సిక్ నిపుణులు మృతదేహాన్ని పరీక్షిస్తున్నారు. 

* కరోనా వైరస్ పుట్టింది వుహాన్‌లోనే.
* చైనాతో సహా ఇతర దేశాలకు పాకింది. 
* వుహాన్ నగరాన్ని నిర్భందించారు. 

* నగరం బయటకు వెళ్లకుండా..బయటి వ్యక్తులు వుహాన్‌కు రాకుండా ఆంక్షలు విధించారు. 
* వుహాన్ వ్యాప్తంగా ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. 
* వైరస్ తీవ్రత కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించిన సంగతి తెలిసిందే. 

Read More : హారన్ మ్రోగిస్తే..అంతే : ముంబై ట్రాఫిక్ పోలీసుల వీడియోకు కేటీఆర్ ఫిదా