ఒకే కరోనా…మూడు అవతారాలు… ముప్పేట దాడి

  • Published By: chvmurthy ,Published On : April 10, 2020 / 12:53 PM IST
ఒకే కరోనా…మూడు అవతారాలు… ముప్పేట దాడి

Updated On : April 10, 2020 / 12:53 PM IST

కరోనా వైరస్ మొదట వూహాన్‌లో కనిపించిన నాటి వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలకు,  ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్‌కు అనేకరూపాలు కనిపించాయి. కరోనా వైరస్ ఎందుకింత ప్రమాదకరం?

ఇది ఎదుగుతోంది. రూపం మార్చుకొంటోంది. వూహాన్‌లో Covid-19 మొదటిగా కనిపించిన నాటి నుంచి వైరస్ జన్యురూపాన్ని గమనిస్తూనే ఉన్నారు. చైనాలో మొదలై, యూరోప్, అమెరికా ఖండాల్లో విలయాన్ని సృష్టించింది. 

మొదట మనుషుల నుంచి మనుషులకు వ్యాపించిన 160 వైరస్ జీనోమ్స్‌ను పూర్తిగా స్టడీ చేసిన సైంటిస్ట్‌లు అదిరిపోయారు. గబ్బిలాల నుంచి వచ్చిన వైరస్ జన్యురూపమే అమెరికా, ఆస్ట్రేలియాలో కనిపించింది. వూహాన్‌లో మాత్రంకాదు.

the University of Cambridge geneticist, Dr Peter Forsterrom, ఉద్దేశంలో కోవిడ్-19 ఫ్యామిలీలో చాలా మ్యూటేషన్స్ ఉన్నాయి. అంటే, మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తున్నప్పుడు, వైరస్ చాలా పరివర్తనం ( Mutate) అవుతోంది.

చైనాలో type B, Type Aలు కనిపిస్తే, పక్కనున్న హాంగ్‌కాంగ్‌లో Type C వ్యాపించింది. అమెరికాలో ఉంది Type Aనే.  స్పెయిన్ ను అల్లల్లాడిస్తోంది Type A వైరసే. అదే ఫ్రాన్స్, బ్రిటన్, డెన్మార్క్, జర్మనీలు Type Bకి బలయ్యాయి. ఇటలీని స్మశానంగా మార్చింది మాత్రం Type Cనే. ఇలాంటి వైరస్ చైనాలో‌ లేనేలేదు. సింగపూర్‌లోనూ Type Cయే వ్యాపించింది.

శాస్త్రవేత్తలు కనిపెట్టిన దాని ప్రకారం, గబ్బిల్లాల్లో కనిపించిన Type Aలో నిజమైన హ్యూమన్ వైరస్ జీనోమ్ ఉంది. ఇది వూహాన్‌లోనూ కనిపించింది. కాకపోతే… అక్కడ మరణాలకు ఈ వైరస్ పూర్తిగా కారణం కాదు. ఇది మ్యూటేట్ అవుతూ…అమెరికాకెళ్లింది. వూహాన్‌లో ఉన్న అమెరికన్స్‌లో ఇది చేరి, అమెరికాను అల్లల్లాడిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియాలో ఈ తరహా వైరసే ఉంది.

చైనా వైరస్‌ అని ట్రంప్ ఆడిపోసుకుంటున్న వైరస్ Type B. ఈ వైరస్ అమెరికాకెళ్లలేదు. తూర్పుఆసియా, ఇండియా వరకు వచ్చింది. ఇక్కడిక్కడ మ్యూటేట్ అవుతూ… కాస్తంత బలహీనపడిందన్నది శాస్త్రవేత్తల అంచనా. Type C రకం యూరోప్‌ను నాశనం చేస్తోంది.

ఇది జనవరి 27న తొలిసారి జర్మన్‌కి సంక్రమించి , అక్కడ నుంచి యూరోప్ కెళ్లింది. ఈ వేరియంట్ చైనా గడ్డమీద లేదు. సింగపూర్, హాంగ్‌కాంగ్, సౌత్‌ కొరియాల్లో కనిపించినా… మరణాలు తక్కువే.

journal Proceedings of the National Academy of Sciences (PNAS)లో పబ్లిష్ అయిన పరిశోధన పత్రం ప్రకారం, Type A వైరస్  bats, pangolinsలో ఉన్న వైరస్‌కు చెందిందే. మొత్తం కరోనా మహమ్మారికి ఇదే కారణం. కాకపోతే ఇది ఒకరినుంచి మరొకరికి సంక్రమిస్తూ, రెండుగా మ్యూటేట్ అయ్యింది.

అంటే పరిణామం చెందింది. Type Aనుంచి  Type Bవచ్చింది. మరి Type C సంగతేంటి? ఇది Type Bకి కూతురులాంటింది. ఇంతకీ ట్రంప్ చెప్పిన వైరస్, చైనాదికాదు. అక్కడ నుంచి పుట్టి, పరిణామం చెందిన వైరస్ వేరియంట్.