కరోనా వైరస్ ఎఫెక్ట్: వాటికి పెరిగిన డిమాండ్

  • Published By: vamsi ,Published On : February 13, 2020 / 06:30 AM IST
కరోనా వైరస్ ఎఫెక్ట్: వాటికి పెరిగిన డిమాండ్

Updated On : February 13, 2020 / 6:30 AM IST

గర్భం రాకుండా ఉండేందుకు, ఎయిడ్స్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఉపయోగించే కండోమ్స్ కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి చెందకుండా కూడా వాడేస్తున్నారట. అవును ఇది నిజం.. సింగపూర్‌లో కరోనా వైరస్ ప్రవేశించిన క్రమంలో సింగపూర్‌లో మాస్కులకు మంచి డిమాండ్ వచ్చింది. అలాగే కండోమ్‌లకు కూడా డిమాండ్ పెరిగిపోయింది. మొఖాలకు మాస్క్‌ వేసుకున్నట్లే.. చేతుల నుంచి వైరస్ వ్యాపించకుండా కండోమ్‌లను వాడుతున్నారట అక్కడి ప్రజలు.

సింగపూర్‌లో ఫిబ్రవరి 7వ తేదీన డిసీజ్ ఔట్‌బ్రేక్ రెస్పాన్స్ సిస్టమ్ కండీషన్ (DORSCON)గా కింద ఆరెంజ్ లెవల్ అలర్ట్ ప్రకటించారు. COVID-19 అనే ఈ కరోనా వైరస్ వల్ల ఇప్పటికే చైనాలో వందలాది మంది చనిపోగా.. ఇతరదేశాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే సింగపూర్ ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారు. మాస్కులు, గ్లవ్స్‌కు భారీ డిమాండ్ రాగా.. వాటి కొరత వచ్చేసింది. కండోమ్‌లను కూడా చేతులకు సేఫ్టీ కోసం వాడుతున్నారు. 

కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే చేతికి గ్లవ్స్ ధరించడం ముఖ్యం. ఆ వైరస్ చాలా శక్తివంతమైనది కావడంతో వస్తువులను ముట్టుకుంటే వచ్చే అవకాశం ఉంది. ఓ వ్యక్తి లిఫ్ట్ బటన్ నొక్కేందుకు వేలుకు కండోమ్ తొడుక్కోగా.. ఆ ఫొటో‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.