కోలుకున్న రోగులకు మళ్లీ కరోనా
దక్షిణ కొరియాలో కరోనా మహమ్మారితో పోరాడి కోలుకొన్న 51 మంది రోగులకు మరోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చిందని సీడీసీ డైరెక్టర్ జనరల్ జియాంగ్ యన్ కింయాంగ్ తెలిపారు. వైరస్ మళ్లీ సోకడంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నామని యన్ కియాంగ్ వెల్లడించారు.

దక్షిణ కొరియాలో కరోనా మహమ్మారితో పోరాడి కోలుకొన్న 51 మంది రోగులకు మరోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చిందని సీడీసీ డైరెక్టర్ జనరల్ జియాంగ్ యన్ కింయాంగ్ తెలిపారు. వైరస్ మళ్లీ సోకడంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నామని యన్ కియాంగ్ వెల్లడించారు.
ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి వణిస్తోంది. వివిధ దేశాల్లో కరోనా కేసులు, మరణాలు పెగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు 89 వేల మంది మృతి చెందారు. 3 లక్షలకు పైగా మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే పాజిటివ్ కేసులతో పోల్చి చూస్తే కోలుకున్న వారి సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. ఈ నేపథ్యంలో పిడులులాంటి వార్త ఆందోళనకు గురిచేస్తోంది. కోలుకున్న కరోనా వైరస్ రోగులకు మళ్లీ కరోనా వచ్చే అవకాశాలు లేకపోలేదని దక్షిణ కొరియాలోని సీడీసీ అభిప్రాయం వ్యక్తం చేసింది.
దక్షిణ కొరియాలో కరోనా మహమ్మారితో పోరాడి కోలుకొని క్వారంటైన్ లో ఉంటున్న 51 మంది రోగులకు మరోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చిందని సీడీసీ డైరెక్టర్ జనరల్ జియాంగ్ యన్ కింయాంగ్ తెలిపారు. వైరస్ మళ్లీ సోకడంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నామని యన్ కియాంగ్ వెల్లడించారు. కొన్ని కేసుల్లో ఓ రోజు పాజిటివ్ గా వస్తే, మరో రోజు నెగెటివ్ గా వస్తుందని, దీనిపై ఫోకస్ పెట్టామని చెప్పారు.
కోలుకున్న కరోనా రోగులకు తిరిగి వైరస్ సోకడంతో వారిని మళ్లీ ఐసోలేషన్ లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కరోనా సోకిన రోగికి రెండు సార్లు నెగెటివ్ రిపోర్టు వస్తేనే అతను పూర్తిగా కోలుకున్నట్లు అని భావిస్తున్నారు. బుధవారం నాటికి దక్షిణకొరియాలో 10 వేల 384 కేసులు నమోదు అయ్యాయి. దాదాపు 6 వేల 776 మంది కరోనా నుంచి కోలుకున్నారు. (డాక్టర్లు,నర్సులకు డబుల్ శాలరీ ప్రకటించిన హర్యానా సీఎం)