ట్రంప్‌కు కరోనా టెస్టు… రిపోర్టులో ఏముందంటే..!
కరోనా వైరస్ చాపకింద నీరులా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్ నెగెటివ్ వచ్చినట్టు ఆయన వైద్యులు వెల్లడించారు.

కరోనా వైరస్ చాపకింద నీరులా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్ నెగెటివ్ వచ్చినట్టు ఆయన వైద్యులు వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్ నెగెటివ్ వచ్చినట్టు ఆయన వైద్యులు వెల్లడించారు. ఈ వైరస్ సోకినట్లు తేలిన బ్రెజిల్ ప్రతినిధి బృందం తన ఫ్లోరిడా రిసార్ట్‌కు వచ్చిన సందర్భంలో వారితో ట్రంప్ సన్నిహితంగా మెలగడంతో ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ట్రంప్‌కు నిర్వహించిన టెస్ట్‌లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని అధ్యక్షుడి వైద్యులు సీన్ కోన్లీ తెలిపారు. బ్రెజిల్ బృందంతో డిన్నర్‌లో పాల్గొన్న వారం రోజుల అనంతరం ట్రంప్‌కు ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని ఆయన తెలిపారు.
కరోనా వైరస్ చాపకింద నీరులా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. 4 రాష్ట్రాలు మినహా అమెరికా అంతటా కరోనా వైరస్ వ్యాపించింది. కరోనా వైరస్‌తో బాధపడుతూ అమెరికాలో ఇప్పటికే 51 మంది మరణించగా దేశవ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. లక్షలాది మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తుండగా..స్కూళ్లు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. అమెరికాలో ఆరోగ్య అత్యయిక పరిస్థితి ప్రకటించారు. అమెరికా హెల్త్ ఎమర్జన్సీని ప్రటించింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా నియంత్రణకు ఫెడరల్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని..నేషనల్ ఎమర్జెన్సీని అధికారికంగా ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. వైరస్ నియంత్రణకు 50 బిలియన్ డాలర్ల నిధిని కేటాయిస్తున్నట్లు చెప్పారు.
రిలీఫ్ ప్యాకేజీ గురించి ఉభయసభల్లో ఓటింగ్ నిర్వహించనున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు అన్ని అవరోధాలను అధిగమిస్తామన్నారు. కరోనా విషయంలో అత్యంత కట్టుదిట్టమైన చర్యల్ని తీసుకుంటున్నామని..ప్రజలు ఆరోగ్యంగా ఉండటం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో అమెరికాకు కార్నివాల్, రాయల్ కరేబియన్, నార్వేయన్, ఎంఎస్‌సీ లాంటి క్రూయిజ్‌లను 30 రోజుల పాటు నిలిపేసినట్లు ట్రంప్ తెలిపారు.
151 దేశాలకు వైరస్ పాకింది. ప్రపంచ వ్యాప్తంగా మృతుల సంఖ్య 5,821కి చేరింది. లక్షా 56 వేల 433 మంది బాధితులు ఉన్నారు. 5 వేల 909 మందికి సీరియస్ అయింది. నాలుగు రాష్ట్రాలు మినహా అమెరికా అంతటా వైరస్ వ్యాపించింది. కరోనా వ్యాప్తి నివారణకు ప్రపంచ దేశాల ప్రయత్నాలు చేస్తున్నాయి. కరోనాపై కఠిన నిర్ణయాల దిశగా దేశాలు అడుగులు వేస్తున్నాయి. ఈ రోజు సార్క్ దేశాధినేతల వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
కరోనాపై పోరుకు నేతలు ఉమ్మడి వ్యూహం ఖరారు చేయనున్నారు. చైనా నుంచి ఇతర దేశాలకు వెళ్లినవారి నుంచే కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఇటలీలో నిన్న ఒక్కరోజే 3497 కేసులు నమోదు కాగా, 175 మంది మృతి చెందారు. ఇరాన్ లో నిన్న 1365 కేసులు నమోదు కాగా 97 మంది చెందారు. స్పెయిన్ లో 1159 కేసులు నమోదు, 62 మంది మృతి చెందారు.