కరోనాతో మహిళల కంటే పురుషులకే ముప్పు ఎక్కువ.. ఎందుకంటే?

కరోనాకు సరిహద్దులు లేవ్.. జాతీ, మత భేదాల్లేవ్.. ప్రతి ఒక్కరికీ సోకుతుంది.. ప్రాణాలు తీస్తుంది.. అయితే కరోనాకు లింగ భేదం మాత్రం ఉందట. అవును మహిళలపై కంటే పురుషులపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందట. కరోనావైరస్ కేసులపై లింగ విభజన డేటాను సమకూర్చడానికి నిపుణులు దేశాలకు పిలుపునివ్వగా.. ఇప్పటివరకు వచ్చిన నేవేధికల ప్రకారం.. స్త్రీలలో కంటే పురుషులపైనే దీని ప్రభావం ఎక్కువగా ఉంది.
పురుషులు, స్త్రీల విషయంలో కరోనా వైరస్ వ్యాప్తి, మరణాలకు సంబంధించి వ్యత్యాసాలు ఏమైనా ఉన్నాయా? అనే ప్రశ్నకు సమాధానంగా.. ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య విశ్లేషిస్తే పురుషుల కంటే మహిళల్లో కరోనా బారినపడేవారి సంఖ్య తక్కువగా ఉన్నట్టు గణాంకాలు వెల్లడించాయి.
కరోనా వైరస్ సంక్రమణ రేట్లు.. మరణాల సంఖ్యపై రోజువారీ డేటాను పరిశీలిస్తే.. మహిళల కంటే పురుషులకు పెద్ద ముప్పుగా కరోనా మారిపోయినట్లుగా కనిపిస్తుంది. ప్రధానంగా కరోనావైరస్ వ్యాప్తి ఇంకా ప్రారంభ దశలోనే ఉండగా.. ఇటలీ, చైనా, జర్మనీ, స్పెయిన్, ఇరాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, పోర్చుగల్, డెన్మార్క్ మరియు స్వీడన్‌లలో వైరస్ బారిన పడి మరణించిన వారిలో పురుషులే ఎక్కువగా ఉన్నారు.
కరోనా వచ్చిన తొలిదేశం చైనాలో మొత్తం మరణాల్లో 2.8 శాతం మంది పురుషులుంటే, మహిళలు 1.7 శాతం మాత్రమే ఉన్నారు. వైరస్ బారిన పడి మరణించిన వారిలో పురుషులు చైనాలో 68% మంది, 71%మంది ఇటలీలో ఉన్నారు. ఈ వ్యత్యాసానికి కారణం ఏమిటనేది శాస్త్రవేత్తలు ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నప్పటికి, పురుషుల్లో పొగతాగే అలవాటు ఎక్కువగా ఉండటం వారిలో అధిక మరణాలరేటుకు కారణమైందని చెబుతున్నారు. హృద్రోగ సంబంధ సమస్యలు సహజంగానే మహిళల్లో తక్కువగా ఉంటాయని,
అంతేకాదు పరిశుభ్రత, వైద్యుల సూచనలు, ఇతరత్రా జాగ్రత్తలు పాటించడంలో పురుషుల కంటే మహిళలు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు అని, అది కూడా దానికి ఒక కారణం కావచ్చుననేది ఒక అభిప్రాయం.
Also Read | ఫోన్ చేయండి..ఇంటి వద్దకే సరుకులు : ఈ జాగ్రత్తలు పాటించండి