కరోనాకు చెక్ పెట్టేందుకు 1970ల నాటి మెడిసిన్!

  • Published By: vamsi ,Published On : August 16, 2020 / 10:30 AM IST
కరోనాకు చెక్ పెట్టేందుకు 1970ల నాటి మెడిసిన్!

Updated On : August 16, 2020 / 12:42 PM IST

కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు కొత్త కొత్తగా ప్రయత్నాలు చేస్తుండగా.. కరోనా దెబ్బకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న అమెరికా కొత్త మందులుతో ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అంగస్తంభన సమస్య నివారణ కోసం ఉపయోగించే ఆర్ఎల్‌ఎఫ్-100(అవిప్టాడిల్) ఔషధం కరోనాకు విరుగుడుగా పనిచేస్తుందని వెల్లడైంది. ఇది 1970నాటి మెడిసిన్ కావడం విశేషం.



అమెరికాలోని హ్యూస్టన్ సిటీలో కరోనా బారినపడి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న 54 ఏళ్ల ఓ ఓ రోగికి ఉపశమనం కోసం ఈ మెడిసిన్ ఇవ్వగా.. అతడు ఊహించనివిధంగా కరోనా నుంచి కోలుకున్నాడు. దీంతో మరో 15 మంది రోగులకు కూడా ఈ ఔషధాన్ని ఇవ్వడంతో వారు కూడా కోలుకున్నారు. దీంతో ఈ మెడిసిన్‌పై ప్రయోగాలు చేయడానికి ఔషధ సంస్థ అనుమతులు తీసుకుంది. సాధారణంగా శృంగార సమస్యలు ఉన్నవారు అవిప్టాడిల్ డ్రగ్ వాడుతారు. దీనిని ముక్కు ద్వారా పీలిస్తే అంగస్తంభన సమస్యలు పరిష్కారం అవుతాయి.



హ్యూస్టన్‌ నగరంలో 54 ఏళ్ల ఓ వ్యక్తికి ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స విఫలం కావడంతో హాస్పిటల్‌లో చేరాడు. చికిత్స పొందుతున్న సమయంలో అతడికి కరోనా సోకగా.. తీవ్ర శ్వాసకోశ సమస్య తలెత్తడంతో అతడికి ఆర్ఎల్‌ఎఫ్-100 మెడిసిన్‌‍ను ఇచ్చారు. దీంతో నాలుగు రోజుల వ్యవధిలోనే అతడి ఆరోగ్యం మెరుగుపడింది. దాంతో అతనిని వెంటిలేటర్‌పై నుంచి జనరల్‌ వార్డుకు మార్చినట్లు హ్యూస్టన్‌ మెథడిస్ట్‌ హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.



అవిప్టాడిల్ పేటెంట్‌ హక్కులు కలిగి ఉన్న స్విట్జర్లాండ్‌ కంపెనీ రిలీఫ్‌ థెరపాటిక్స్‌, ఇజ్రాయెలీ-అమెరికన్‌ సంస్థ న్యూరోఆర్‌ఎక్స్‌తో కలిసి సెప్టెంబర్ 1 నుంచి ప్రయోగాలు చేయబోతున్నాయి. మరోవైపు ఎఫ్‌డీఏ ఆధ్వర్యంలో ఈ మెడిసిన్‌పై రెండో దశ ప్రయోగ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ ఔషధం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. పరిశోధనల్లో వాటిపై దృష్టి పెట్టటనున్నారు పరిశోధకులు.