వాక్సిన్ వచ్చినా, యేడాది వరకు కరోనా నిబంధనలు తప్పవ్

  • Published By: sreehari ,Published On : October 4, 2020 / 06:36 PM IST
వాక్సిన్ వచ్చినా, యేడాది వరకు కరోనా నిబంధనలు తప్పవ్

Updated On : October 4, 2020 / 7:46 PM IST

Covid-19 vaccine : కోవిడ్ వ్యాక్సిన్ రాబోతోందనగానే జనం రిలాక్స్ అయిపోతున్నారు. చాలామంది మాస్క్ లు వాడకపోవడం తమ ధైర్యానికి సింబలనుకుంటున్నారు.



వాక్సిన్ అందుబాటులోకి వచ్చినా, కోవిడ్ నిబంధనలు మరో యేడాదిపాటు కొనసాగించాల్సిందేనంటున్నారు వైద్య నిపుణులు. వ్యాక్సిన్ వచ్చినా అందరికీ వ్యాక్సిన్ వేయాలంటే బ్రిటన్ లాంటి చిన్నదేశానికే ఆరునెలల నుంచి యేడాది వరకు పడుతుందని అంచనా. మరి ఇండియాలాంటి 130 కోట్ల జనాభా ఉన్న దేశానికి ఎన్నేళ్లుపడుతుంది? కనీసం రెండేళ్లన్నది అంచనా. అందుకే 2022 నాటి వరకు ఇండియాలో మాస్క్, కోవిడ్ నిబంధనలు తప్పవని అంటున్నారు.

కరోనా నుంచి రక్షించే  వాక్సిన్  వస్తే social distancing rules పాటించక్కర్లేదని, అంతా మామూలైపోయినట్లేనని ఎక్కువమంది అనుకొంటున్నారు. ఇది నిజం కాబోదని  Imperial College London నిపుణుల బృందం అంటోంది.



covid symptoms కొత్తవి బైటపడుతున్నాయి. వ్యాక్సిన్ వేసుకున్నవాళ్లుకూడా మరికొన్ని నెలలపాటు కోవిడ్ నిబంధనలను అనుసరించాల్సిందేనని తేల్చేశారు.  వచ్చే మార్చికి, కోవిడ్ వ్యాక్సిన్ రెడీ అన్నది అందరి అంచనా.అలాగని ఎప్రిల్ నుంచి ప్రపంచమేమీ మారిపోదని, నార్మల్ కాబోదని అంటున్నారు. ముందు ప్రయార్టీ వర్గాలకు వ్యాక్సిన్ వేస్తారు.  ఆ తర్వాతే మిగిలిన ప్రజలకు వ్యాక్సిన్. అంటే వీధిలోని 25 ఏళ్ల కుర్రాడికి చివరికి అందుతుంది.