కరోనా రాకుండా ఉండాలంటే..ఈ మంత్రం జపించండి..దలైలామ సూచన

  • Published By: madhu ,Published On : January 30, 2020 / 06:24 AM IST
కరోనా రాకుండా ఉండాలంటే..ఈ మంత్రం జపించండి..దలైలామ సూచన

Updated On : January 30, 2020 / 6:24 AM IST

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడాలిస్తోంది. చైనాలో వ్యాప్తి చెందిన ఈ వైరస్ ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. చైనాలో వందల సంఖ్యలో మృతి చెందుతుండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తౌమతోంది. దీనిపై ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా స్పందించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే..తారా మంత్రి పఠించాలంటూ సూచించారు.

* కరోనా వైరస్ కాటుకు బలవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
* చైనాలోని భారతీయులు ఆందోళనలో ఉన్నారు. 
* వారందరినీ వెనక్కి తీసుకొచ్చేందుకు భారత కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
 

* ఇప్పటికే.. చైనాకు రెండు విమానాలను పంపించింది.
* బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా.. ఆ దేశ దౌత్య అధికారులతో చర్చలు జరుపుతోంది.
* ఇప్పటివరకు భారత ఎంబసీని సంప్రదించని భారతీయుల కోసం హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఏర్పాటు చేసింది. 

ఓం తారే..తుత్తారే..తురే సోహా..అంటూ మంత్రం పఠిస్తున్న ఆడియో క్లిప్‌ను తన అనుచరులో కోసం దలైలామా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయ్యింది. దలైలామా చెప్పిన ఈ మంత్రం చైనాలో వైరస్‌లాగానే వ్యాప్తి చెందుతోంది. కరోనా వైరస్ దరిచేరుకుండా..వ్యాప్తి చెందకుండా ఉంటుందంటున్నారు. 

* ఇక కరోనా వైరస్ విషయానికి వస్తే..చైనా మొత్తం కకావికలమౌతోంది. నగరాలే స్తంభించిపోతున్నాయి. 
* ఈ వైరస్ దెబ్బకు చైనీయులు బెంబేలెత్తిపోతున్నారు.
 

* ఈ వైరస్ వ్యాపించి..170 మంది చనిపోవడం తీవ్ర ఆందోనలు రేకేత్తిస్తోంది. 
* ఇంకా 8వేలకు మందికి పైగానే కరోనా సోకిందని అంచనా వేస్తున్నారు.
* చైనాలో ఉన్న విదేశీయులు భయంతో వణికిపోతున్నారు. 

Read More : కరోనా కాటు..170 మంది మృతి : చైనాకు భారత్ విమానాలు