మీలో FOMU ఉందా? డేటింగ్ వ్యక్తిని కలవాలంటే భయమేస్తుందా? ఇదిగో ఈ టిప్స్ పాటించండి!

  • Published By: srihari ,Published On : June 19, 2020 / 11:39 AM IST
మీలో FOMU ఉందా? డేటింగ్ వ్యక్తిని కలవాలంటే భయమేస్తుందా? ఇదిగో ఈ టిప్స్ పాటించండి!

Updated On : June 19, 2020 / 11:39 AM IST

కొవిడ్-19 లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమతం కావాల్సి వచ్చింది. లాక్ డౌన్ సడలింపులతో ఇప్పుడెప్పుడే అందరూ ఇళ్లలోనుంచి బయటకు వస్తున్నారు. కానీ, కరోనా భయం అలానే కనిపిస్తోంది. ఎవరినైనా కలవాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో FOMU (fear of meeting) నేరుగా కలవాలంటేనే భయపడుతున్నారు.

ఇప్పటివరకూ ఆన్‌లైన్‌ ZOOM మీట్ వర్చువల్ IRLలకు అలవాటు పడిన వారంతా వాస్తవ ప్రపంచంలోకి వచ్చేందుకు ఆత్రుతగా కనిపిస్తున్నారు. Badoo అనే డేటింగ్ యాప్.. ఇటీవల FOMU అనే పేరుతో సర్వే నిర్వహించింది. వర్చువల్ డేటింగ్ చేసిన వ్యక్తితో నేరుగా కలిసేందుకు భయపడిపోతున్నారని తెలిపింది. సామాజిక దూరంతో పార్క్ ల్లో కలిసిన సందర్భాల్లోనూ తీవ్ర ఆందోళనగా కనిపిస్తోందని గుర్తించినట్టు పేర్కొంది.

యూకే నుంచి 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల  వయస్సు గల 1003 మంది ఒంటరి వ్యక్తులపై Badoo సర్వే చేసింది. ఐదుగురిలో ముగ్గురు 60 శాతం ఒంటరి వ్యక్తులు కొవిడ్ భయంతో రియల్ లైఫ్ డేటింగ్ అంటే ఆందోళన చెందుతున్నారని గుర్తించారు. లాక్ డౌన్ లో ఆన్ లైన్ డేటింగ్ చేసిన వ్యక్తులను నేరుగా కలవడం పట్ల కూడా కాస్తా సిగ్గుగా ఫీల్ అవుతున్నారంట.
 Here’s how to deal with it

FOMU ఫీలింగ్‌తో పాటు నెలల తరబడి ఆన్ లైన్ డేటింగ్ చేసిన తర్వాత రియల్ లైఫ్ డేటింగ్ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదంటున్నారు. సర్వే చేసిన వారిలో 23 శాతం మంది లాక్ డౌన్ లో కోల్పోయిన సమయాన్ని సమకూర్చుకోవాలని యోచిస్టున్నట్టు తెలిపారు. డేటింగ్ చేయడం కష్టమని అంటున్నారు. డేటింగ్ నిపుణులు లవ్ కోచ్ అయిన Persia Lawson డేటింగ్ రిలేషన్ ప్రపంచంలో FOMUను అధిగమించడానికి కొన్ని చిట్కాలను అందిస్తున్నారు.

వీడియో కాల్‌తో ముందుగానే డేట్ ప్లాన్ :
ప్రస్తుత మార్గదర్శకాలకు అనుగుణంగా నియమాలను తెలుసుకొని ముందుగానే డేటింగ్ పై ఒకరినొకరు కమ్యూనికేట్ అవ్వడం చాలా ముఖ్యమని పర్షియా చెప్పారు. ఏదైనా భయంపై నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం. తద్వారా మీరు పూర్తిగా గుడ్డిగా డేటింగ్‌కు వెళ్ళరు. ఇద్దరికీ సాపేక్షంగా సులువుగా ఉండే పార్కుపై నిర్ణయం తీసుకోవచ్చు. అప్పుడు స్వంత దుప్పటి, ఆహారం పానీయం, హ్యాండ్ శానిటైజర్ తీసుకురావచ్చు. మీ దుప్పట్లను ఒకదానికొకటి రెండు మీటర్ల దూరంలో ఉంచండి. నడక లేదా బైక్ పై కూడా వెళ్లొచ్చు.

మీ ఆందోళన గురించి మాట్లాడండి:
మీరు ధైర్యంగా ఆందోళనగా లేన్నట్టగా నటించాల్సిన అవసరం లేదు. ఆత్రుతగా అనిపించడం సాధారణమని తెలుసుకోండి. దాని గురించి మాట్లాడటానికి ఇది చాలా సాయపడుతుంది. Badoo యాప్‌లో UK మార్కెటింగ్ డైరెక్టర్ నటాషా బ్రీఫెల్ మాట్లాడుతూ.. ఇంతకాలం లాక్ డౌన్‌లో ఉన్న తర్వాత ఒకరిని IRL కలవాలంటే కాస్త ఆత్రుగా అనిపిస్తుంది. కొంతకాలంగా వీడియో కాల్ ద్వారా చాటింగ్ చేసి ఉంటారు. ఇలా ఖచ్చితంగా మీ కెమిస్ట్రీ ఎలా ఉందో గమనించే ఉంటారు. మీరు ఎలా భావిస్తున్నారనే దాని గురించి నిజాయితీగా ఉండండి. భౌతిక దూరంతో డేట్  ఎలా ఉంటుందో అంచనా వేసుకోవచ్చు. తద్వారా మీ మనస్సును విశ్రాంతిగా ఉంచుతుంది.

భౌతిక వస్తువులతో అలింగనం చేసుకోండి?
మీరు పార్కులో కలవడానికి అనుమతి ఉండొచ్చు. కానీ, లాక్ డౌన్ నియమాలతో ఇంట్లో శృంగారం చేయడం లేదా శారీరకంగా సన్నిహితంగా ఉండటాన్ని ఇప్పటికీ నిషేధించాయని గుర్తుంచుకోండి. అలా అని చెడ్డ విషయంగా చూడవద్దు. భౌతికంగా కలవడానికి ముందే మీరు నిజంగా ఇష్టంగా ఉన్నారో లేదో తెలుసుకోవచ్చు. సామాజికంగా దూరమయ్యే డేటింగ్‌ను ప్రారంభించండి. మంచి సంభాషణ ఎంతో మేలు చేస్తుంది. భౌతిక వస్తువులతో నెమ్మదిగా ఒకరినొకరు అలింగనం చేసుకోవచ్చు. నేరుగా ఒకరినొకరు కౌగిలించుకోవడం కంటే ఇది ఎంతో ఉత్తమం.

తక్కువ ఖర్చుతో డేట్ సెలబ్రేట్ చేసుకోండి :
డేట్ అనగానే.. అదేదో ఖరీదైన డ్రింక్స్, విందుల్లో పాల్గొనాలని కాదు.. పర్షియా ఏమంటున్నారంటే?… ‘మీరు ఏమి చేయగలరో చాలా పరిమిత ఆప్షన్లతో ( మీరు బయట ఉండి రెండు మీటర్ల దూరం)లో నిర్వహించాలి. ఒక చిన్న వేదికను ఎంచుకోవచ్చు. భారీ క్యూలతో వ్యవహరించండి.