2021 నోబెల్ శాంతి ప్రైజ్‌కు నామినేట్ అయిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి ప్రైజ్-2021కు నామినేట్ అయ్యారు. ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చినందున ఆయన పేరును నామినేట్ చేశారు.. నార్వేజియన్ పార్లమెంట్ సభ్యుడు Christian Tybring-Gjedde ట్రంప్ పేరును నామినేట్ చేశారు.
ఈయన నార్వేజియన్ పార్లమెంటులో నాలుగుసార్లు సభ్యుడుగా పోటీ చేశారు.. నాటో పార్లమెంటరీ అసెంబ్లీకి నార్వేజియన్ ప్రతినిధిగా కొనసాగుతున్నారు. యూఏఈ, ఇజ్రాయెల్ మధ్య మైత్రికి సాయపడినందుకు ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసినట్లు Gjedde వెల్లడించారు.
https://10tv.in/there-is-a-small-but-real-chance-an-asteroid-will-hit-earth-the-day-before-the-us-election/
పలు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడంలో ఇతరుల కంటే ట్రంప్ ఎక్కువ కృషిచేశారని జెజెడ్డే చెప్పారు. అమెరికా దళాలను ఉపసంహరించు కున్నందుకు ట్రంప్‌ను ఆయన కొనియాడారు. అయితే నవంబర్‌లో అమెరికాలో ఎన్నికలు జరుగనున్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ పేరు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 2009లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు.