Marburg Virus: ఉన్నవి చాలవన్నట్టు ఇంకో కొత్త వైరస్.. ఆల్రెడీ పాకడం మొదలైంది.. 13 మంది..

నివాసితులు, ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని రాయబార కార్యాలయం నొక్కి చెప్పింది.

Marburg Virus: ఉన్నవి చాలవన్నట్టు ఇంకో కొత్త వైరస్.. ఆల్రెడీ పాకడం మొదలైంది.. 13 మంది..

Updated On : December 7, 2025 / 8:06 PM IST

Marburg Virus: కరోనా వైరస్ సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. యావత్ ప్రపంచాన్ని ఈ మహమ్మారి గడగడలాడించింది. ప్రజలకు నిద్రలేని రాత్రులు మిగిల్చింది. ఎంతో మంది కరోనా బారిన పడి చనిపోయారు. దాని బారిన పడి కోలుకున్నా.. చాలామంది ఇప్పటికీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆ తర్వాత కరోనా వైరస్ కంట్రోల్ అయ్యింది. దాంతో జనం కాస్త ఊపిరిపీల్చుకున్నారు. అయితే, ఆ తర్వాత కూడా అనేక కొత్త వైరస్ లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రపంచంలో ఏదో ఒక ప్రాంతంలో కొత్త వైరస్ వెలుగుచూస్తోంది.

ఉన్నవి చాలవు అన్నట్లుగా ఇప్పుడు ఇంకో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. అంతేకాదు పాకడం కూడా మొదలైపోయింది. ఇథియోపియాలో కొత్త వైరస్ బయటపడింది. అదే మార్ బర్గ్ వైరస్. ఇప్పటికే 13 కేసులు నమోదయ్యాయి. వారి నమూనాలు సేకరించి ల్యాబ్ లో టెస్ట్ చేయగా మార్ బర్గ్ వైరస్ బారిన పడినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

మార్ బర్గ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వం అప్రమత్తమైంది. తమ దేశ పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్బర్గ్ వైరస్ ప్రాణాంతక వ్యాప్తి నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని తన పౌరులను హెచ్చరించింది ఇథియోపియాలోని సౌదీ రాయబార కార్యాలయం.

ఇథియోపియాలోని సౌత్ ఓమో జోన్‌తో పాటు మార్బర్గ్ వైరస్ కేసులు నమోదైన ప్రాంతాలకు ప్రయాణించకుండా ఉండాలని అడిస్ అబాబాలోని సౌదీ రాయబార కార్యాలయం తమ దేశ పౌరులకు ఆదేశాలు జారీ చేసింది. నివాసితులు, ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని రాయబార కార్యాలయం నొక్కి చెప్పింది. రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలంది. అనవసరమైన గ్యాథరింగ్స్ తగ్గించుకోవాలని, స్థానిక అధికారుల సూచనలను పాటించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే అనేక మరణాలకు దారితీసిన వైరస్‌కు గురయ్యే ప్రమాదాన్ని తగ్గించడానికి ఈ చర్యలు కీలకమైనవిగా అధికారులు పేర్కొన్నారు.

ప్రస్తుతం ఇథియోపియాలో ఉన్న సౌదీ జాతీయులు.. రాయబార కార్యాలయంతో టచ్ లో ఉండాలని, అత్యవసర హాట్‌లైన్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. గైడెన్స్, సాయం, మద్దతు కోసం ఈ హాట్ లైన్ 24 గంటలూ అందుబాటులో ఉంటుందన్నారు. పౌరులు వైరస్, దాన్ని వ్యాప్తి తీవ్రతను అర్థం చేసుకోవాలని కోరింది. తమను తాము వైరస్ బారి నుంచి రక్షించుకోవడానికి సకాలంలో చర్యలు తీసుకునేలా రాయబార కార్యాలయం పని చేస్తుందన్నారు.

13 కేసులు.. 8 మరణాలు..

డిసెంబర్ 3 నాటికి మొత్తం 13 మార్బర్గ్ వైరస్ కేసులను ఇథియోపియన్ ఆరోగ్య అధికారులు ల్యాబ్ టెస్టుల ద్వారా నిర్ధారించారు. ఇందులో భయపెట్టే విషయం ఏంటంటే.. 13 మందిలో 8మంది మరణించారు. ఇది వైరస్ తీవ్రతను, అధిక మరణాల రేటును హైలైట్ చేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్లు ప్రధానంగా దక్షిణ ఇథియోపియా, సిడామా ప్రాంతాల్లో వెలుగుచూశాయి. ఈ వైరస్ వ్యాప్తి స్థానికంగా కలకలం రేపింది.

పరిస్థితి తీవ్రతను సౌదీ అరేబియా ప్రభుత్వం నొక్కి చెప్పింది. సౌదీ పౌరులు అప్రమత్తంగా ఉండాలంది. ఆరోగ్య పరంగా ఏవైనా తేడాలు గమనించినా, లక్షణాలు కనిపించినా వెంటనే అధికారులకు లేదా రాయబార కార్యాలయానికి నివేదించాలని కోరింది. వైరస్ బారిన పడినట్లు అనుమానం కలిగితే రోగ నిర్ధారణ కోసం తక్షణ వైద్య సాయం పొందాలని ఆరోగ్య నిపుణులు సూచించారు.

Also Read: నా సంసారం ముక్కలు కాకుండా కాపాడండి మోదీ.. భారత ప్రధానికి పాకిస్థాన్‌ యువతి వేడుకోలు

కాగా.. ప్రాణాంతకమైన ఈ మార్బర్గ్ వైరస్.. దక్షిణ ఇథియోపియాలో వ్యాప్తి చెందుతోంది. డిసెంబర్ 3 నాటికి 13 కేసులు నమోదయ్యాయి. వైరఎస్ సోకిన వారిలో 8 మంది మృతి చెందడం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ మార్బర్గ్ వైరస్ ఎబోలా కుటుంబానికి చెందినది. మరణాల రేటు 88శాతం వరకు ఉండొచ్చు. ప్రస్తుతం టీకా(వ్యాక్సిన్) లేదా ప్రత్యేక చికిత్స అందుబాటులో లేదు. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట వంటి లక్షణాలు ఉంటాయి” అని డబ్ల్యూహెచ్ వో తెలిపింది.