వండర్ వరల్డ్ : ఫైర్ ఫాల్ గురించి తెలుసా 

  • Published By: madhu ,Published On : January 21, 2020 / 12:23 PM IST
వండర్ వరల్డ్ : ఫైర్ ఫాల్ గురించి తెలుసా 

Updated On : January 21, 2020 / 12:23 PM IST

ప్రపంచంలో ఎన్నో విచిత్రాలు జరుగుతుంటాయి. ప్రపంచంలో అంతుచిక్కని ప్రకృతి విచిత్రాలు చోటు చేసుకుంటుంటాయి. అలాగే ఓ ప్రాంతంలో కూడా ఇలాగే జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం జరిగే అద్భుతం చూడటానికి ఎంతోమంది పోటీ పడుతుంటారు. కొన్ని రోజులు మాత్రమే చోటు చేసుకొనే ఈ అపురూప దృశ్యం కోసం చూడటానికి ఎక్కడినుండో వస్తుంటారు. అసలు విషయం ఏంటీ అంటే…ఫైర్ ఫాల్…తెల్లని జలపాతంలో..నిప్పుల ప్రవాహంలా నీళ్లు కిందకు దూకడం అరుదైన దృశ్యం. 

అమెరికాలోని కాలిఫోర్నియాలో Yosemite జాతీయ పార్క్. ఇక్కడ అత్యంత అద్భుతమైన ఫైర్ ఫాల్ ఉంది. సూర్యకిరణాలు పడి..వెన్నెలలాగ ఉండే..నీళ్లు..నిప్పుల ప్రవాహంలా కనిపిస్తుంది. ఏడాదిలో కొన్ని నిమిషాలు మాత్రమే ఈ ప్రకృతి మాయాజాలం కనిపిస్తుంది. చాలా మంది దీనిని చూసేందుకు ఇక్కడకు వచ్చి కెమెరాలో బంధించేందుకు పోటీ పడుతుంటారు. తాము చూసిన అత్యద్భుతమైన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా పోస్టులు చేస్తున్నారు. 

యూఎస్‌లోని కాలిఫోర్నియాలో ఉన్న ఈ జాతీయ పార్క్ చాలా పేరు గడించింది. అందమైన 13 వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడ. ఎంతో పై ఎత్తులో నుంచి దుంకుతున్న జలపాతాలను చూసేందుకు చాలా మంది వస్తుంటారు. కానీ ఇక్కడున్న వాటర్ ఫాల్స్‌లో ఫైర్ ఫాల్ అందర్నీ ఆకర్షిస్తుంటుంది. పై ఎత్తు నుంచి నీళ్లు కిందకు దుంకుతుంటే..లావా అని అనిపిస్తుంది. ఎక్కువ శాతం ఫిబ్రవరి మాసంలో ఇలా జరుగుతుంటుంది.