Canada shooting : కెనడాలో కాల్పులు…అయిదుగురి మృతి

కెనడాలోని ఉత్తర అంటారియో నగరంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మరణించారు. షూటర్‌తో సహా ఐదుగురు వ్యక్తులు తుపాకీ కాల్పుల్లో మరణించినట్లు కెనడియన్ పోలీసులు బుధవారం తెలిపారు....

Canada shooting : కెనడాలో కాల్పులు…అయిదుగురి మృతి

Canada shooting

Updated On : October 25, 2023 / 7:51 AM IST

Canada shooting : కెనడాలోని ఉత్తర అంటారియో నగరంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మరణించారు. షూటర్‌తో సహా ఐదుగురు వ్యక్తులు తుపాకీ కాల్పుల్లో మరణించినట్లు కెనడియన్ పోలీసులు బుధవారం తెలిపారు. రెండు ఇళ్లలో హింస వల్ల కాల్పులు జరిగాయని పోలీసులు చెప్పారు.

Also Read :  Bird Flu : అంటార్కిటికా ప్రాంతంలో మొట్టమొదటి సారి బర్డ్ ఫ్లూ ముప్పు

మంగళవారం రాత్రి స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు కాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో 6 ఏళ్ల, 7 ఏళ్ల, 12 ఏళ్ల, 41 ఏళ్ల వయసున్న వారు మరణించారని కెనడా పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి 10:20 గంటలకు వారికి ఫోన్ కాల్ వచ్చిందని, టాన్‌క్రెడ్ స్ట్రీట్‌లోని ఒక ఇంట్లో తుపాకీ గాయంతో 41 ఏళ్ల వ్యక్తి మరణించాడని కెనడా పోలీసులు కనుగొన్నారు.

Also Read :  Uttarakhand : నదిలోకి దూసుకెళ్లిన కారు…ఆరుగురి ఆదికైలాష్ యాత్రికుల మృతి

పది నిమిషాల తర్వాత సమీపంలోని నివాసంలో తుపాకీ కాల్పులు జరిగినట్లు వారికి మరో కాల్ వచ్చింది. తదనంతరం పోలీసులు ముగ్గురు పిల్లల మృతదేహాలను కనుగొన్నారు.