Indian Embassy : రష్యా-యుక్రెయిన్ ఉద్రిక్తతలు.. స్వదేశానికి తిరిగి రండి.. మరోసారి విద్యార్థులకు సూచన!
భారత్‌కు తిరిగి వచ్చే విమానాల కోసం సంబంధిత వ్యక్తులను సంప్రదించాలని భారతీయ విద్యార్థులకు భారతీయ రాయబారి కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది.

Indian Embassy In Ukraine Again Asks Students To Leave As Tensions With Russia Escalate
Indian Embassy Asks Students : రష్యా, యుక్రెయిన్ మధ్య సంక్షోభం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటనతో మరింత వివాదం మరింత ముదిరింది. వివాదస్పద రెండు ప్రాంతాలకు రష్యా దళాలను మోహరించడంపై పుతిన్ సంతకం చేయడంతో అంతర్జాతీయంగా వ్యతిరేకత నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా తక్షణ ఆంక్షలను విధించేందుకు సిద్ధమైంది. అధ్యక్షుడు జో బిడెన్ ఆయా ప్రాంతాలలో US వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయడానికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. భారత్‌కు తిరిగి వచ్చే విమానాల కోసం సంబంధిత వ్యక్తులను సంప్రదించాలని భారతీయ విద్యార్థులకు భారతీయ రాయబారి కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది.
రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులో పరిస్థితి తీవ్రతరం కావడంతో కైవ్‌లోని భారత రాయబార కార్యాలయం ఉక్రెయిన్ నుంచి అదనపు విమానాలను నడుపుతోంది. యుక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితిలో కొనసాగుతున్న ఉద్రిక్తతల్లో అనిశ్చితి దృష్ట్యా.. అదనపు విమానాలు నడుపనున్నట్టు భారత రాయబార కార్యాలయం అడ్వైజరీలో పేర్కొంది. కైవ్ నుంచి న్యూఢిల్లీకి అందుబాటులో ఉన్న విమానాలకు సంబంధించి బుకింగ్ విధానాన్ని కూడా అందుబాటులో ఉంచింది. ఫిబ్రవరి 25, మార్చి 6 మధ్య మొత్తం నాలుగు విమానాలు బయలుదేరాల్సి ఉంది. Air Arabia, Fly Dubai, Qatar Airways సంబంధించి షెడ్యూల్డ్ విమానాల జాబితాను వెల్లడించింది. ఇప్పటికే ఉక్రెయిన్ నుంచి ఇండియాకు సాధారణ విమాన సర్వీసులను నిర్వహిస్తున్నాయి.
అన్ని పక్షాలతో సంయమనం అవసరం.. భారత్ విజ్ఞప్తి :
ఉక్రెయిన్‌లో జరుగుతున్న పరిణామాలపై UNSC సమావేశంలో అన్ని పక్షాలు అత్యంత సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని భారత్ అభిప్రాయపడింది. అలాగే పరస్పర సామరస్యపూర్వక పరిష్కారానికి దౌత్య ప్రయత్నాలను తీవ్రతరం చేయవలసిన అవసరాన్ని భారత్ గట్టిగా నొక్కి చెప్పింది. పౌరుల భద్రత, భారత్ కు చాలా అవసరమని ఆయన పునరుద్ఘాటించారు. ఇరవై వేల మందికి పైగా భారతీయ విద్యార్థులు, ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలతో సహా వివిధ ప్రాంతాల్లో చదువుతున్నారని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి టిఎస్ తిరుమూర్తి అన్నారు. భారతీయ పౌరుల శ్రేయస్సు మాకు ప్రాధాన్యమని అన్నారాయన. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు ప్రాంతాలపై ఏ క్షణమైన రష్యా బలగాలు మోహరించనున్నట్టు ప్రకటించారు. ఐరోపాలో యుద్ధ వాతారణం నెలకొన్న నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే అమెరికా దాని యూరోపియన్ మిత్రదేశాలు రష్యాపై తాజా ఆంక్షలను ప్రకటించబోతున్నాయి.
గత 24 గంటల్లో తూర్పున రష్యా అనుకూల వేర్పాటువాదులు జరిపిన షెల్లింగ్‌లో ఇద్దరు సైనికులు మరణించగా, 12 మంది గాయపడ్డారని యుక్రేనియన్ మిలిటరీ తెలిపింది. కాల్పుల విరమణ ఉల్లంఘనల కారణంగానే ఈ ఏడాదిలో అత్యధిక మంది మరణించారని వెల్లడించింది. పుతిన్ ప్రకటనతో వివాదాస్పద రెండు ప్రాంతాల్లో రష్యన్ దళాలను మోహరించడంపై డిక్రీపై సంతకం చేయడం మరింత ఆందోళనలను రేకిత్తించింది. అంతర్జాతీయంగా వ్యతిరేకతో రావడంతో తక్షణమే అమెరికా ఆంక్షలను విధించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అమెరికా వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయడంపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.
Read Also : Ukraine Crisis : యుక్రెయిన్ సంక్షోభం.. రష్యాపై పశ్చిమ దేశాలు విధించబోయే కఠిన ఆంక్షలు ఇవే?