Delta variant: వ్యాక్సిన్ ప్రభావానికి మించి చెలరేగిపోతున్న డెల్టా వేరియంట్
ఇజ్రాయెల్‌లో కరోనావైరస్ కేసులు పెరుగుతూ ఉండటంతో అక్కడివారంతా ఫైజర్/బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఈ మేర డెల్టా వేరియంట్‌పై జరిపిన స్టడీలో వ్యాక్సిన్‌ను బైపాస్ చేస్తున్నట్లుగా టాప్ ఎక్స్‌పర్ట్ వెల్లడించారు.

Delta Variant (1)
Delta variant: ఇజ్రాయెల్‌లో కరోనావైరస్ కేసులు పెరుగుతూ ఉండటంతో అక్కడివారంతా ఫైజర్/బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఈ మేర డెల్టా వేరియంట్‌పై జరిపిన స్టడీలో వ్యాక్సిన్‌ను బైపాస్ చేస్తున్నట్లుగా టాప్ ఎక్స్‌పర్ట్ వెల్లడించారు. ఇజ్రాయెల్ నేషనల్ ఎక్స్‌పర్ట్ ర్యాన్ బాలిసర్ మాట్లాడుతూ.. కొవిడ్ వ్యాక్సిన్ల కంటే వైరస్ వేగం ఎక్కువగా ఉందని అన్నారు.
కాకపోతే మొత్తం కేసులను బట్టి చూస్తే పూర్తిగా వ్యాక్సినేషన్ చేపట్టడంతో వైరస్ నమోదువుతున్న సంఖ్య తక్కువగా ఉంది. జనాభాలో వ్యాప్తి కూడా తక్కువగానే ఉంది. వ్యాక్సినేషన్ ఎక్కువగా జరిపిన కారణంగా రోజుకు ఐదు కేసులు మాత్రమే నమోదయ్యేవట.
అలాంటిది ఈ డెల్టా వైరియంట్ ప్రభావంతో ఇటీవల కాలంలో రోజుకు 300వరకూ కేసులు నమోదవుతున్నాయి. వారిలో సగం మంది చిన్నారులే ఉంటున్నారట. కారణం వ్యాక్సినేషన్ వేసుకుంది పెద్ద వాళ్లకే అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకూ 85శాతం ఇజ్రాయెల్ దేశస్థులు వ్యాక్సినేషన్ చేయించుకున్నారు.
ఇక వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఎటువంటి నిబంధనలు సడలించమని బాలిసర్ స్పష్టం చేశారు. అవసరమైతే పాత నిబంధనలు మళ్లీ అమల్లోకి తెస్తామని అన్నారు. కాగా, 12రోజులుగా ఒక్క కొవిడ్ మృతి కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు.