Thousand Years Egg: తవ్వకాల్లో బైటపడ్డ వెయ్యేళ్ల నాటి కోడిగుడ్డు!
ఇజ్రాయెల్ లో పరిశోధకులు జరిపిన తవ్వకాల్లో ఏకంగా ‘1000 ఏళ్లనాటి కోడిగుడ్డు’ బయటపడింది. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..తవ్వకాల్లో బయటపడ్డ ఆ గుడ్డు ఇప్పటికీ చిన్న చిన్న పగుళ్లు మినహా ఏమాత్రం పగిలిపోకుండా..అలాగే ఉండటం.

1000 Years Egg (1)
1,000 Year-Old Chicken Egg : పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాల్లో ఎన్నో ఏళ్లనాటివే కాదు దశాబ్దాలు..శతాబ్ధాల నాటి విలువైన విస్తువులు బైటపడుతుంటాయి. భూమి పొరల్లో దాక్కున్న చరిత్రను పురావస్తు శాస్త్రవేత్తలు వెలికితీస్తుంటారు. ఈక్రమంలో ఏకంగా ఇజ్రాయెల్ లో తవ్వకాల ఏకంగా ‘1000 ఏళ్లనాటి కోడిగుడ్డు’ బయటపడింది. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. కానీ అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..తవ్వకాల్లో బయటపడ్డ ఆ గుడ్డు ఇప్పటికీ ఏమాత్రం పగిలిపోకుండా..అలాగే ఉండటం. యావ్నే పట్టణ శివార్లలోని ఓ పురాతన కందకంలో ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ (ఐఏఏ) ఈ గుడ్డును గుర్తించింది.
ఇది ఇస్లామిక్ యుగం నాటిదని పరిశోధకులు భావిస్తున్నారు. కాగా..ఈరోజుల్లో గుడ్లు ఫ్రిజ్ లో కాకుండా బయటపెడితే వారం రోజుల్లోనే పాడైపోతాయి. అటువంటిది సంవత్సరం కాదు పది సంవత్సరాలు కాదు వంద కూడా కాదు ఏకంగా 1000 సంవత్సరాల పాటు ఆ గుడ్డు ఎటువంటి డ్యామేజ్ లేకండా అలాగే ఏమాత్రం చెక్కు చెదరకుండా అలా ఉందీ అంటూ సాధారణ విషయం కాదు. అదే విషయంపై పరిశోధకులు సైతం ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.
ఈ గుడ్డు విషయంలో పరిశోధకులు మాట్లాడుతూ..ప్రస్తుత కాలంలో గుడ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండడంలేదు..అటువంటిది ఏకంగా 1000 ఏళ్ల క్రితంనాటి గుడ్డు ఇప్పటికీ..చిన్నపాటి పగుళ్లు మినహా మిగిలినదంతా చెక్కుచెదరకుండా ఉండడం చాలా ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. ఈ గుడ్డు గురించి మరింత లోతుగా పరిశోధనలు చేస్తామని..డీఎన్ఏ విశ్లేషణ కోసం భద్ర పరుస్తామని తెలిపారు. ఈ గుడ్డు 6 సెంటీమీటర్ల పొడవు ఉందని తెలిపారు. ఈ గుడ్డుతో పాటు కొన్ని ఎముకలు, ఒక బొమ్మలు కూడా కందకంలో లభించాయని తెలిపారు. ఆ ఎముకలు కూడా 1000 ఏళ్లనాటివని తెలిపారు.