టైమ్ వచ్చేసింది.. ఇప్పుడు మాస్క్ ధరించాలి: WHO

  • Published By: veegamteam ,Published On : April 2, 2020 / 09:41 AM IST
టైమ్ వచ్చేసింది.. ఇప్పుడు మాస్క్ ధరించాలి: WHO

Updated On : April 2, 2020 / 9:41 AM IST

కరోనా వైరస్(COVID-1)9 వ్యాప్తిని నివారించేందుకు ఇప్పటివరకు కొందరు మాస్క్‌లు ధరిస్తున్నారు. మరికొందరు అవసరం లేదని అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాస్క్‌లు కచ్చితంగా ధరించాలా? అసలు మాస్క్‌ ఎంత వరకు సేఫ్‌ అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంతకుముందు స్పష్టంచేసింది. COVID-19తో బాధపడుతున్నవారు లేదా వారికి ట్రీట్మెంట్ ఇచ్చేవారు మాత్రం మాస్క్ వేసుకుంటే సరిపోతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. ఒకవేళ దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది ఉంటే మాత్రమే మాస్క్ తప్పకుండా ధరించాలని, మాములుగా ఉండేవాళ్లు ధరించాల్సిన అవసరం లేదని సూచనలు చేసింది. భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ఇదే సలహా ఇచ్చింది. 

అయితే కొత్తగా కరోనా భారీన పడినవారిలో 25శాతం మంది లక్షణాలు లేకుండా పాజిటివ్ అని తేలినట్లు USA సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) డైరెక్టర్ హెచ్చరించాడు. ఇతర నివేదికలు ఐస్లాండ్ నుండి వచ్చిన డేటాలు కూడా ఇదే విషయాన్ని ప్రకటించాయి. పాజిటివ్ పరీక్షించిన వారిలో 50శాతం మంది లక్షణాలు ఏమీ లేకుండా వ్యాధి భారిన పడినవారే. లక్షణాలు కనిపించక ముందే చైనాలో 20 నుండి 40శాతం వరకు వ్యాధి వ్యాపించిందని, పరిశోధనా బృందం స్పష్టం చేసింది.

ఈ క్రమంలో ప్రతిఒక్కరు మాస్కులు ధరించాల్సిన సమయం వచ్చేసినట్లుగా.. CDC వెల్లడించింది. కోవిడ్ 19 వ్యాప్తిని నివారించడానికి మాస్కులను ఉపయోగించాలని ప్రభుత్వం చెబుతుంది. ఇప్పటివరకు దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షనాలు ఉన్నవాళ్లు మాత్రమే మాస్కులు ధరించాలని who సూచనలు చేసింది. అందుకు కారణం కూడా ఉంది.  ప్రపంచవ్యాప్త మాస్కుల కొరత వచ్చే అవకాశం ఉందని WHO చెప్పింది. 

అయితే చైనా, తైవాన్, జపాన్, దక్షిణ కొరియా, థాయిలాండ్ దేశాలలో ప్రతి ఒక్కరు వ్యాధుల వ్యాప్తిని అడ్డుకునేందుకు మాస్కులు ధరిస్తుండగా.. ఇప్పుడు అన్నీ దేశాల్లో ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని చెబుతున్నారు. ఎందుకంటే కరోనా వైరస్ రాకుండా మాస్కులు ఆపగలవు కాబట్టి.