little girl super backflips : గ్యాప్ లేకుండా చిన్నారి బ్యాక్‌ఫ్లిప్స్‌..లెక్క పెట్టటం కష్టమే ఈ చిచ్చర పిడుగు ఫీట్లు

little girl super backflips : గ్యాప్ లేకుండా చిన్నారి బ్యాక్‌ఫ్లిప్స్‌..లెక్క పెట్టటం కష్టమే ఈ చిచ్చర పిడుగు ఫీట్లు

Little Girl Super Backflips

Updated On : April 22, 2021 / 5:19 PM IST

little girl super backflips : బుడ్డి పిల్ల. కాదు కాదు పిల్ల కాదు చిచ్చరపిడుగు చేసే ఫీట్లు చూస్తే కళ్లు తిరగిపోవటం ఖాయం. ఏంటీ పిల్లా లేక చక్రమా అనే డౌట్ రానే వస్తుంది. వామ్మో ఏమి తిరుగుడురా బాబూ..కడుపులోవన్నీ నోట్లో కొచ్చేసి కళ్లు తిరగి ఢాం అని కింద పడిపోవటం ఖాయం అనుకుంటాం ఈ బుడ్జిపిల్ల ఫీట్లు చూస్తే..ఎన్నో వైరల్ వీడియోలు చూసి ఉంటాం. కానీ ఈ చిచ్చరపిడుగు వీడియో మాత్రం వెరీ వెరీ స్పెషల్ అబ్బా అని కచ్చితంగా అంటారు.

జిమ్నాస్టిక్స్ అనగానే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది చైనా. చిన్నప్పటినుంచే చిన్నారులకు జిమ్నాస్టిక్స్ నేర్పిస్తుంటారు. ఒళ్లును విల్లులా వంచేసే జిమ్నాస్టిక్స్ అంటే చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఒళ్లు విల్లులా వంచడం నేర్పిస్తారు చైనీయులు. బాడీలో ప్రతీ పార్టూ రబ్బర్ లా సాగిపోతున్నట్లే ఉంటుంది. చైనా అమ్మాయిలు జిమ్నాస్టిక్స్ ఓ స్పెషల్ అనేలా ఉంటాయి.

ఈ వీడియోలోని బుల్లి పాప చేసిన ఫీట్ చూస్తే… వామ్మో..వాయ్యో..ఓరి దేవుడో ఇవేం పల్టీలబ్బా అంటూ అబ్బురపడిపోతాం. అంత చిన్న పిల్ల పల్టీ కొట్టడమే గ్రేట్ అనుకుంటే..ఈ చిచ్చరపిడుగు మాత్రం ఏకంగా చక్రంలా గింగిరాలు తిరిపోతోంది. సూపర్ ఫాస్టుగా బ్యాక్ ఫ్లిప్ పల్టీలు కొట్టేస్తూ కళ్లు చెదిరే ఫీట్లు చేసేస్తోంది. ఒకే చోట బ్యాక్ ప్లిప్ కొట్టడం ఈ బుడ్డిపిల్లకు మాత్రమే చెల్లిందేమో అనిపిస్తుంది. అది కూడా ఏకంగా 52 నిమిషాల పాటూ… ఒకే స్పీడుతో గిరగిరా తిరిగింది. చూస్తే మన కళ్లను మనమే నమ్మలేం.

ఈ ఒక్క వీడియోతో… ఈ చిన్నారి… పిల్లా… చిచ్చర పిడుగా అనిపించుకుంది. అసలు ఎన్నిసార్లు తిరిగిందో మీరు కౌంట్ చేయడం కూడా చాలా చాలా కష్టం. ఎందుకంటే… ఆమె ఫాస్ట్‌కు మన కౌంట్ ఏమాత్రం పనిచేయదు. అందుకే ఈ వీడియో వైరల్ అయ్యింది. ఇప్పటికే 65 లక్షల మందికి పైగా చూశారు. మీరు కూడా ఓ లుక్ వేయిండీ..కౌంట్ చేయటానికి ట్రై చేయండీ..కానీ సాధ్యం కాదని మాత్రం కచ్చితంగా చెప్పగలం..