నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్.. ఏటీఎంకి వెళ్లి శానిటైజర్ చోరీ

ఏటీఎంకి వెళ్లి డబ్బు చోరీ చేసిన వాళ్ల గురించి విని ఉంటారు, టీవీల్లో చూసి ఉంటారు. కానీ ఓ యువకుడు ఏటీఎంకి వెళ్లిన చేసిన వెరైటీ దొంగతనం గురించి తెలిస్తే విస్తుపోతారు.

  • Published By: veegamteam ,Published On : March 30, 2020 / 02:20 PM IST
నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్.. ఏటీఎంకి వెళ్లి శానిటైజర్ చోరీ

Updated On : March 30, 2020 / 2:20 PM IST

ఏటీఎంకి వెళ్లి డబ్బు చోరీ చేసిన వాళ్ల గురించి విని ఉంటారు, టీవీల్లో చూసి ఉంటారు. కానీ ఓ యువకుడు ఏటీఎంకి వెళ్లిన చేసిన వెరైటీ దొంగతనం గురించి తెలిస్తే విస్తుపోతారు.

ఏటీఎంకి వెళ్లి డబ్బు చోరీ చేసిన వాళ్ల గురించి విని ఉంటారు, టీవీల్లో చూసి ఉంటారు. కానీ ఓ యువకుడు ఏటీఎంకి వెళ్లిన చేసిన వెరైటీ దొంగతనం గురించి తెలిస్తే విస్తుపోతారు. నవ్వాలో ఏడ్వాలో అర్థం కాక తల పట్టుకుంటారు. ఇదేం కక్కుర్తి రా బాబూ అని తిట్టుకుంటారు. ఇంతకీ ఏటీఎంకి వెళ్లి ఆ యువకుడు ఏం చేశాడో తెలుసా? కస్టమర్ల కోసం అక్కడ ఉంచిన శానిటైజర్ ను దొంగలించాడు. నమ్మబుద్ధి కావడం లేదా? కానీ ఇది నిజం.

డబ్బు డ్రా చేశాక, శానిటైజర్ బాటిల్ చోరీ:
పాకిస్తాన్ లోని పెషావర్ లో నమక్ మండీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఓ యవకుడు డబ్బు విత్‌ డ్రా చేసుకునేందుకు ఏటీఎంకు వెళ్లాడు. ముందుగా అక్కడ ఉంచిన శానిటైజర్ బాటిల్ తీసుకున్నాడు. కాస్త శానిటైజర్ చేతులకు పూసుకున్నాడు. ఆ తర్వాత డబ్బు డ్రా చేసుకున్నాడు. ఇంతలో అతడి మనసులో ఏం బుద్ధి పుట్టిందో కానీ, అతడి కన్ను పక్కనే ఉంచిన శానిటైజర్‌ పై పడింది. అవసరంగా శానిటైజర్ కి ఎక్కువ ధర పెట్టడం ఎందుకు అనుకున్నాడో మరో కారణమో కానీ ఇదే అదునుగా దాన్ని తన చొక్కాలో దాచుకుని వెళ్లిపోయాడు. ఇదంతా ఏటీఎంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. శానిటైజర్ బాటిల్ ను తన చొక్కాలో పెట్టుకుంటున్నది సీసీ కెమెరాలో రికార్డ్ అవుతున్న విషయం అతడికి తెలుసో లేదో, లేక తెలిసి చేశాడో కానీ.. బాటిల్ ను మాత్రం ఎత్తుకెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను పాకిస్తాన్‌కు చెందిన నైలా ఇనయాత్‌ అనే జర్నలిస్ట్ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశాడు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరీ ఇంత కక్కుర్తా?
‘ఏటీఎంకి వచ్చి డబ్బు చోరీ చేసిన వాళ్లను చూశాము. కానీ.. శానిటైజర్‌ బాటిల్‌ను దొంగతనం చేయడం ఇప్పుడే చూస్తున్నా’, ‘ఇలాంటి వారి వల్ల ఆ దేశం పురోగమిస్తుంది’, ‘పాపం ఆయన కష్టాల్లో ఉన్నాడేమో..అందుకే శానిటైజర్‌ చోరీ చేశాడు’, ‘ఛీ,ఛీ..మరీ ఇంత కక్కుర్తా? వీడెవండి బాబూ?’, ఇలాంటి చోరీ నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కరోనా కారణంగా మాస్కులు, శానిటైజర్లకు ఫుల్ డిమాండ్:
కరోనా మహమ్మరి కారణంగా ప్రపంచవ్యాప్తంగా మాస్కులు, శానిటైజర్లు ఉపయోగిస్తున్నారు. దీంతో వీటికి డిమాండ్‌ పెరిగింది. కరోనా బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా శానిటైజర్‌ లేదా సబ్బుతో చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో చాలామంది.. అధిక ధరలు ఉన్నప్పటికీ శానిటైజర్లను కొనుగోలు చేస్తున్నారు.

నవ్వాలో ఏడ్వాలో అర్థం కాని పరిస్థితి:
కొంతమంది.. అధిక ధరలు ఉన్నప్పటికీ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్తున్నారు. మరికొంత మంది ఇంట్లోనే శానిటైజర్లను తయారు చేసుకుంటున్నారు. ఇక ఈ రెండు తన వల్ల కాదనుకున్నాడో మరో కారణమో కానీ.. పాకిస్తాన్ కు చెందిన అతడు మాత్రం.. సింపుల్‌గా ఏటీఎం సెంటర్‌లో ఉంచిన శానిటైజర్ బాటిల్‌నే ఎత్తుకెళ్లాడు. ఏటీఎంకు వచ్చే వినియోగదారుల క్షేమం కోసం బ్యాంకులు.. ఏటీఎం కేంద్రాల్లోనూ శానిటైజర్లు ఉంచాయి. ఏటీఎంను వినియోగించే ముందు శానిటైజర్ల అప్లయ్ చేసుకుంటే కరోనా నుంచి బయటపడొచ్చని బ్యాంకు అధికారులు శానిటైజర్లు ఏర్పాటు చేశారు. కానీ, ఇతడి లాంటి కొంతమంది కక్కుర్తి వ్యక్తులు వాటిని కూడా వదలడం లేదు.