Mark Zuckerberg : బట్టలు కుట్టడం నేర్చుకుంటున్న జుకర్ బర్గ్… ఎందుకు? ఎవరి కోసం?

జుకర్ బర్గ్ సమయం దొరికితే ఏం చేస్తారు? ఆయన హాబీలు ఏంటి? తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది కదా.. ఆయన తన కూతుళ్ల కోసం నెల రోజులుగా కష్టపడి 3డి ప్రింటింగ్ డ్రెస్‌లు డిజైన్ చేయడం నేర్చుకున్నారట.

Mark Zuckerberg : బట్టలు కుట్టడం నేర్చుకుంటున్న జుకర్ బర్గ్… ఎందుకు? ఎవరి కోసం?

Mark Zuckerberg

Updated On : May 2, 2023 / 12:06 PM IST

Mark Zuckerberg :  చాలామందికి రకరకాల హాబీలు ఉంటాయి. సోషల్ మీడియా దిగ్గజం మార్క్ జుకర్ బర్గ్ కి ఓ హాబీ ఉంది. తన కూతుళ్ల కోసం టైం వెచ్చించి ఆయన నెలరోజులుగా ఏం చేస్తున్నారో తెలుసా?

Meta Layoff: మరో పదివేల మందిని తొలగించనున్న ‘మెటా’.. వెల్లడించిన జుకర్ బర్గ్

జుకర్ బర్గ్ రీసెంట్‌గా 3డి-ప్రింటెడ్ బట్టలు తయారు చేయడం నేర్చుకున్నారు. నిజమే. అదీ తన కూతుళ్ల కోసమట. ఆ విషయాన్ని స్వయంగా ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. ‘ నేను కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాను. అందులో భాగంగా నెలరోజులుగా 3డి ప్రింటింగ్ దుస్తులను నా కూతుళ్ల కోసం డిజైన్ చేయడం నేర్చుకున్నాను. నిజమే బట్టలు కుట్టడం నేర్చుకున్నాను’ అని రాసి ఆకుపచ్చ, నీలం రంగుల్లో డిజైన్ చేసిన 3డి దుస్తుల ఫోటోలను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Virtual Reality : ఇంటర్నెట్ ఏలేది వర్చువల్ రియాల్టీ…వీడియో గేమ్ ఆడిన జుకర్ బర్గ్

జుకర్ బర్గ్ పోస్ట్‌పై చాలామంది నెటిజన్లు స్పందించారు. మీ హాబీ బాగుంది.. మీ డిజైన్లు చూడటానికి చాలా బాగున్నాయి.. త్వరలో మీరు ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి రావాలని ఆశిస్తున్నాము..’ అంటూ కామెంట్లు పెట్టారు. తన వ్యాపారంలో ఒక్క నిముషం ఖాళీ లేకుండా బిజీగా ఉండే జుకర్ బర్గ్.. తన కూతుళ్ల దుస్తులు డిజైన్ చేసి ఇవ్వడమంటే చాలా ముచ్చట అనిపిస్తోంది. అటు వ్యాపారం.. ఇటు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ..  టైం మేనేజ్మెంట్‌తో ముందుకు వెళ్తున్న జుకర్ బర్గ్ ని మెచ్చుకుని తీరాల్సిందే.

 

View this post on Instagram

 

A post shared by Mark Zuckerberg (@zuck)