‘ట్రంప్ భార్య బురద ప్యాక్ కావాలని అడిగారు’

‘ట్రంప్ భార్య బురద ప్యాక్ కావాలని అడిగారు’

Updated On : February 25, 2020 / 3:13 AM IST

మొగల్ చక్రవర్తి కట్టించిన 17వ శతాబ్ది అద్భుతం తాజ్‌మహల్‌ను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సందర్శించారు. కుటుంబసమేతంగా భారత్ కు వచ్చిన ఆయన.. గైడ్ సహాయంతో తాజ్‌మహల్ పరిసరాలు తిరిగి అక్కడ ఫొటోలు దిగారు. ఆయనతో పాటు నితిన్ కుమార్ అనే భారత గైడ్ ఉన్నారు. పాలరాతి కట్టడం చూసి (incredible) అత్యద్భుతంగా ఉందని కాంప్లిమెంట్ ఇచ్చినట్లు చెప్పారు. 

డ్వైట్ డేవిడ్ ఈసెన్‌హవర్(1959), బిల్ క్లింటన్(2000)తర్వాత తాజ్‌మహల్‌ను చూడటానికి వచ్చిన మూడో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ‘వారికి తాజ్‌మహల్ వెనకున్న స్టోరీ అంతా చెప్పారు. ప్రెసిడెంట్ ట్రంప్ షాజహాన్.. ముంతాజ్ మహల్ కథ విని చాలా ఎమోషనల్ అయ్యారు. సొంత కొడుకు ఔరంగజేబ్ చేతిలో హౌజ్ అరెస్టు అయిన సంగతి.. ముంతాజ్ సమాధి దగ్గరే అతణ్ని పాతి పెట్టిందీ అన్నీ వివరించాను’ అని చెప్పాడు. 

ఇదిలా ఉంటే, తాజ్‌మహల్ చూసే సమయంలో ట్రంప్ భార్య మెలానియా ట్రంప్‌కు బురద ట్రీట్మెంట్ గురించి అడిగారట. mud-pack treatment ప్రొసెస్ గురించి గైడ్‌ను వివరాలు అడిగారట. 1631వ సంవత్సరంలో కట్టిన ఈ కట్టడం చూసి మెలానియా మనసు పారేసుకున్నారు. అక్కడున్న విజిటర్ బుక్‌లో ‘తాజ్‌మహల్ మమ్మల్ని ఇన్‌స్పైర్ చేసింది. భారత వారసత్వ సంపద చూసేందుకు ఇదొక అనువైన స్థలం. థ్యాంక్యూ ఇండియా’ అని రాశారు. 

పర్యటనలో భాగంగా రెండో రోజు చర్చించే అంశాలివే:
* చదువు, ఉపాధి, వ్యాపారం, ఇలా..అనేక మంది భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లారు.
* 2010-2017 మధ్య భారతీయుల వలసలు 50 శాతం పెరిగాయని అంచాన. అక్కడ స్థిరపడిన వారందరిలో చాలా మందికి ఓటు హక్కు లభించింది.
* అమెరికాలో 50 రాష్ట్రాలుంటే..వాటిలో 16 రాష్ట్రాల్లో 1శాతం కంటే..ఎక్కువగా ప్రవాస భారతీయులున్నారు. 
* అమెరికా జనాభా 33 కోట్లు. ఇందులో 4.4 కోట్ల మంది వివిధ దేశాల నుంచి వచ్చిన వారు. 
* 2016 ఎన్నికల్లో ట్రంప్ ఒక్క రాష్ట్రంలో 10 నుంచి 11 వేల మధ్య ఆధిక్యం సంపాదించారు. 
* 16 రాష్ట్రాల్లో పరిశీలించగా..10 చోట్ల డెమోక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ (57.66 శాతం), ఆరు చోట్ల రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ (29.3 శాతం)కు మద్దతు ఇచ్చారని సర్వేలు వెల్లడించాయి. 
* మెజార్టీని పెంచుకొనేందుకు..ఇప్పటి నుంచే రిపబ్లికన్లు పక్కాగా వ్యూహాలు పన్నుతున్నారని అంచనా. 
* అందులో భాగంగానే ప్రవాస భారతీయులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. 
* పెన్సిల్వేనియా, మిషిగాన్, విస్కాన్ సిన్, ఫ్లోరిడా నగరాల్లో భారతీయ అమెరికన్లు 6.5 లక్షల మంది ఉంటారని అంచనా. ఇందులో గుజరాతీయులు అధికం. 
* ఓటర్లను దృష్టిలో ఉంచుకొనే..భారత పర్యటనలో..అందులో..గుజరాత్‌కు వస్తున్నారనేది పరిశీలకుల అంచనా.