కోవిడ్-19 వ్యాక్సిన్ పై ఇండోనేషియా ముస్లింల ఆందోళన..ఆస్ట్రాజెనికా క్లారిటీ
తమ కొవిడ్-19 వ్యాక్సిన్ లో పంది మాంసం ఉత్పన్న పదార్థాలు వేటినీ వాడట్లేదని ఆస్ట్రాజెనికా కంపెనీ ఆదివారం(మార్చి-21,2021)ప్రకటించింది.

No Pork Derived Products Astrazeneca Counters Indonesian Muslims Concern Over Covid 19 Vaccine
No pork తమ కొవిడ్-19 వ్యాక్సిన్ లో పంది మాంసం ఉత్పన్న పదార్థాలు వేటినీ వాడట్లేదని ఆస్ట్రాజెనికా కంపెనీ ఆదివారం(మార్చి-21,2021)ప్రకటించింది. ఉత్పత్తి ప్రక్రియ యొక్క అన్ని దశలలో ఈ వైరస్ వెక్టర్ వ్యాక్సిన్ పంది మాంసం-ఉత్పన్న ఉత్పత్తులు లేదా ఇతర జంతు ఉత్పత్తులతో సంబంధం కలిగి లేదని ఆస్ట్రాజెనెకా ఇండోనేషియా ప్రతినిధి రిజ్మాన్ అబుడెరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా, ఆస్ట్రాజెనికా కొవిడ్-19 వ్యాక్సిన్ పై ఇండోనేషియా ముస్లింలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన ముస్లిం దేశమైన ఇండోనేషియాలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఇస్లామిక్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నదని, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ “హరామ్” అని, ఎందుకంటే వ్యాక్సిన్ తయారీ ప్రక్రియలో “పంది మాంసం ప్యాంక్రియాస్ నుండి ట్రిప్సిన్” ను ఉపయోగిస్తున్నట్లు ఇండోనేషియా అత్యున్నత ముస్లిం మత పెద్ద కౌన్సిల్ “ఇండోనేషియా ఉలేమా కౌన్సిల్” శుక్రవారం తమ వెబ్ సైట్ లో పేర్కొంది. అయితే, దీనిపై ఆదివారం ఆస్ట్రాజెనికా వివరణ ఇచ్చింది. వ్యాక్సిన్ తయారీలో పంది మాంసం ఉత్పన్న పదార్థాలు లేదా మరే జంతు ఉత్పన్న పదార్థాలు వాడట్లేదని సృష్టం చేసింది.
కాగా, యూరప్ దేశాల్లో కొంతమంది టీకా తీసుకున్నవారిలో రక్తం గడ్డకట్టడానికి కారణమైందనే నివేదికలను సమీక్షించిన తరువాత ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి శుక్రవారం ఇండోనేషియా అధికారులు అనుమతిచ్చిన విషయం తెలిసిందే.
ఇక,ఇండోనేషియాలో ఇప్పటివరకు 1,460,184కరోనా కేసులు నమోదవగా,39,550మరణాలు నమోదయ్యాయి.ఇక,1,290,790మంది కరోనా నుంచి కోలుకున్నారు.