Census: 111 మంది అబ్బాయిలకు వంద మంది అమ్మాయిలే.

ప్రతి పదేళ్లకు ఓ సారి ప్రపంచ దేశాలు జన గణన చేస్తాయన్న విషయం విదితమే.. అయితే 2021 లో జనాభా లెక్కలు విడుదల కావలసి ఉండగా కరోనా కారణంగా చాలా దేశాలు జనాభా లెక్కలు చేపట్టలేదు. కరోనా పుట్టినిల్లు చైనా జనాభా లెక్కలు చేపట్టింది.

Census: 111 మంది అబ్బాయిలకు వంద మంది అమ్మాయిలే.

Census

Updated On : May 18, 2021 / 12:48 PM IST

Census: ప్రతి పదేళ్లకు ఓ సారి ప్రపంచ దేశాలు జన గణన చేస్తాయన్న విషయం విదితమే.. అయితే 2021 లో జనాభా లెక్కలు విడుదల కావలసి ఉండగా కరోనా కారణంగా చాలా దేశాలు జనాభా లెక్కలు చేపట్టలేదు. కరోనా పుట్టినిల్లు చైనా జనాభా లెక్కలు చేపట్టింది. చైనా తాజాగా చేసిన జనగణనలో విస్తుగొల్పే విషయాలు వెల్లడయ్యాయి. దేశ జనాభాలో ముఖ్యంగా పెళ్లి కాని వారు అధికంగా ఉన్నారని తేలింది. ఈ విషయం తాజాగా చేసిన జనాభా లెక్కల్లో వెల్లడైంది.

చైనా దేశంలో పెళ్లికాని యువకుల సంఖ్య అధికంగా ఉందని ఈ లెక్కల్లో వెల్లడైంది. ఇక తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం చైనాలో జనాభా వృద్ధి తగ్గింది. మరో వైపు చైనా జనాభా పెరుగుదల విషయంలో పాటించిన విధానాల వలన పెళ్లికాని ప్రసాదుల సంఖ్య కూడా అధికంగా ఉన్నట్లు తేలింది. దేశంలో లింగ సమతుల్యత పాటించకపోవడం వలన ఈ సమస్య ఏర్పడిందని మేధావులు చెబుతున్నారు. దేశంలో పెళ్లి వయసుకు వచ్చిన వారు 3 కోట్ల మంది ఉన్నారని జనాభా లెక్కలు చెబుతున్నాయి.

111.3 పురుషులకు వంద మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. దీంతో మిగతా 11 మంది సన్యాసులుగా మిగిలిపోవాల్సిందే నని భయపడుతున్నారట అక్కడి యువకులు. చైనా పాటించిన ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అనే నినాదమే ఇప్పుడు పెళ్లికాని యువకులకు శాపంగా మారిందని అంటున్నారు అక్కడి నిపుణులు.