Pakistan : మరోసారి వక్రబుద్ధి బయటపెట్టిన పాక్.. తాలిబన్ సాయం తీసుకుంటామంటూ వ్యాఖ్య

జమ్ముక‌శ్మీర్ స‌మ‌స్యను ప‌రిష్కరించ‌డానికి తాలిబ‌న్ల సాయం తీసుకుంటామ‌ని పాకిస్తాన్ అధికార పార్టీ పాకిస్తాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ అధికార ప్రతినిధి నీలం ఇర్షాద్ షేక్ వెల్లడించారు.

Pakistan : మరోసారి వక్రబుద్ధి బయటపెట్టిన పాక్.. తాలిబన్ సాయం తీసుకుంటామంటూ వ్యాఖ్య

Pakisthan

Updated On : August 25, 2021 / 9:22 PM IST

Pakistan :  జమ్ముకశ్మీర్‌ అంశంలో పాకిస్తాన్‌ మ‌రోసారి తన వ‌క్రబుద్దిని బ‌య‌ట‌పెట్టుకుంది. జ‌మ్ముక‌శ్మీర్ స‌మ‌స్యను ప‌రిష్కరించ‌డానికి తాలిబ‌న్ల సాయం తీసుకుంటామ‌ని ఆదేశ అధికార పార్టీ పాకిస్తాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ అధికార ప్రతినిధి నీలం ఇర్షాద్ షేక్ వెల్లడించారు. టీవీ చానెల్‌లో జ‌రిగిన చ‌ర్చలో కాశ్మీర్‌ విషయంలో తాలిబన్ల సాయం తీసుకుంటామన్నారు నీలం ఇర్షాద్ షేక్ .

క‌శ్మీర్ అంశంపై పాకిస్తాన్‌తో చేతులు క‌లుపుతామ‌ని తాలిబ‌న్లు ప్రక‌టించార‌ని నీలం ఇర్షాద్ షేక్ తెలిపారు. ఆయన వ్యాఖ్యలతో పాకిస్తాన్ సైన్యానికి, తాలిబ‌న్లకు ఉన్న స‌న్నిహిత సంబంధాలు బ‌హిర్గతం అయ్యాయి. పీటీఐ అధికార ప్రతినిధి నోటి నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడగానే అప్రమ‌త్తమైన చానెల్ న్యూస్ యాంక‌ర్‌..ఈ షో ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం అవుతుందని.. భార‌తీయులు కూడా వీక్షిస్తున్నారని తెలిపింది.

అయినా ఈ విషయం ప్రపంచానికి తెలియాల్సిందే అన్నట్టు ఇర్షాద్‌ తాలిబన్లకు పాక్‌ప్రభుత్వానికి ఉన్న సంబంధాన్ని బయటపెట్టేశారు. ఇర్షాద్‌ వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆఫ్ఘాన్‌ను స్వాధీనం చేసుకోవడంతాలిబన్లకు అంత ఈజీ కాదని.. దీని వెనుక పాకిస్తాన్ సహకారం ఉందని ముందు నుంచీ అనుమానించామన్నారు ప్రపంచదేశాల నేతలు. ఇర్షాద్‌ వ్యాఖ్యలతో ఈ విషయం తేటతెల్లమైందన్నారు . తాలిబన్లతో పాటు పాక్‌పైనా ఆంక్షలు కఠినతరం చేయాలన్న డిమాండ్‌ ఊపందుకుంటుంది.