ఇస్లామాబాద్, రావల్పిండిల్లో డిఫెన్స్ సైరన్ : పాక్ ప్రజల్లో గుబులు

ఇస్లామాబాద్, రావల్పిండిల్లో డిఫెన్స్ సైరన్ : పాక్ ప్రజల్లో గుబులు

Updated On : June 21, 2021 / 4:36 PM IST

ఇస్లామాబాద్ : ఎన్నో ఏళ్లుగా వాడని సివిలి డిఫెన్స్ సైరన్ లను పాకిస్థాన్ మోగించింది.  పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ సర్జికల్ ఎటాక్స్ పాక్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. పైకి మేకపోతు గాంభీర్యాన్ని కనబరుస్తోంది.  ఈ క్రమంలో పాక్ భారత్ ల మధ్య దాదాపు యుద్ధ వాతావరణం నెలకొన్ని పరిస్థితుల్లో..పాకిస్థాన్ లోని ఇస్లాబాద్, రావల్పిండి నగరాల్లో డిఫెన్స్ (రక్షణ) సైరన్లను మోగిస్తోంది.
శత్రు దేశపు విమానాలు బాంబులతో వస్తుంటే డిఫెన్స్ (రక్షణ) సైరన్లను మోగించి..ప్రజలను అప్రమత్తం చేస్తారు. భారత్ సర్జికల్  స్ట్రయిక్స్ అనంతరం భారత్, పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో ఫిబ్రవరి 27 ఉదయం పాకిస్థాన్ ఇస్లామాబాద్, రావల్పిండి నగరాల్లో సైరన్ లను  మోగించింది. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు ఉరుకులు.. పరుగులు పెడుతు హడలిపోతున్నారు. ఈ సైరన్ లు ఉదయం నుంచి నిరాటంకంగా మోగుతున్నాయి. భారత్ పై దాడికి దిగాలన్న ఆలోచనలో ఉన్న పాకిస్థాన్..తమ దేశ  పౌరులను అప్రమత్తం చేస్తోందని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. నిన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, ఏం జరిగినా ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో పాకిస్థాన్ యుద్ధానికి సిద్ధపడుతోందని తెలుస్తోంది.

 

  • ప్రజలను అప్రమత్తం చేస్తున్న పాకిస్థాన్
  • నిరాటంకంగా మోగుతున్న సైరన్ లు
  • ప్రజలు దేనికైనా సిద్ధంగా ఉండాలన్న ఇమ్రాన్ ఖాన్