YouTuber Azlan Shah Donkey Gift : వధువుకు ‘గాడిద’ను గిఫ్టుగా ఇచ్చిన వరుడు .. ఆమె ఏంచేసిందంటే..
సాధారణంగా వరుడు వధువుకు గిఫ్టు ఇవ్వాలంటే ఏదోకటి వినూత్నంగా ఇస్తాడు. బంగారమో లేదా, వాహనమో..లేదా ఇంకేదైనా విలువైన వస్తువులో.. ఖరీదైన బహుమతులు గిఫ్టుగా ఇస్తుంటారు. కానీ ఓ వరుడు వధువుకు ‘గాడిద’ను గిఫ్టుగా ఇచ్చాడు. ఆ గాడిదను చూసిన ఆ వధువు ఏం చేసిందంటే..

YouTuber Azlan Shah Donkey gift for Wife
YouTuber Azlan Shah Donkey gift for Wife : సాధారణంగా వరుడు వధువుకు గిఫ్టు ఇవ్వాలంటే ఏదోకటి వినూత్నంగా ఇస్తాడు. బంగారమో లేదా, వాహనమో..లేదా ఇంకేదైనా విలువైన వస్తువులో.. ఖరీదైన బహుమతులు గిఫ్టుగా ఇస్తుంటారు. కానీ ఓ వరుడు వధువుకు ‘గాడిద’ను గిఫ్టుగా ఇచ్చాడు. ఆ గాడిదను చూసిన ఆ వధువు తెగ మురిసిపోయింది.ఏంటీ గాడిను గిఫ్టుగా ఇస్తే ఆ వరుడు చెంప పగిలిపోయుంటుందని అనుకుంటున్నారా? కానే కాదు ఇదే మరి వరుడి ఇచ్చిందే ఓ వినూత్న గిఫ్టు అంటూ వధువు అంతకంటే ఆ గాడిదను చూసి మురిసిపోవటం అంటే వింతే మరి.
సాధారణంగా చాలామంది ముఖ్యంగా అమ్మాయిలకు ముద్దు ముద్దుగా ఉండే కక్కపిల్లలను ఇష్టపడతారు. కానీ ఈ వధువుకు మాత్రం గాడిదలంటే ఇష్టమట..అందుకే ఆ వరుడు గాడిద పిల్లను తల్లితో సహా కొనుక్కొచ్చి గిఫ్టు ఇచ్చాడు పాకిస్థాన్‌కు చెందిన యూట్యూబర్ అజ్లాన్ షా. అజ్లాన్ షా కు వరష అనే యువతితో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఆ వేడుకలోనే ఓ గాడిద పిల్లను తీసుకొచ్చి పెళ్లి వేదికమీదన భార్యకు గిఫ్టుగా ఇచ్చాడు అజ్లాన్ షా. అది చూసిన స్నేహితులు, బంధువులు షాక్ అయ్యారు. ఇదేంటీ ఇదేం బహుమతిగా దేవుడా అంటూ అంతా ఆశ్చర్యపోయారు.
వధువుకు గాడిదలంటే ఇష్టమంట. అది తెలుసుకున్న అజ్లాన్ షా గాడిద పిల్లను..దాని తల్లిని రూ.30 వేలు ఖర్చు పెట్టి కొని భార్యకు బహుమతిగా ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోని చూసిన వాళ్లంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. దీనిపై అజ్లాన్ షా మాట్లాడుతూ..వరషకు పిల్ల గాడిదలంటే చాలా ఇష్టం. అందుకే దానిని గిఫ్ట్‌గా ఇచ్చాను. పిల్లతో పాటు తల్లిని కూడా తీసుకొచ్చా. ఈ ప్రపంచంలో గాడిదకు మించిన ఆదర్శమైన జంతువు ఏముంటుంది..? గాడిదలు బాగా కష్టపడతాయి..అందుకే అవంటే నాక్కూడా గౌరవమే.” అంటూ షా ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
View this post on Instagram