అంతర్జాతీయ షోలో పవర్ స్టార్ పాటకు డ్యాన్స్

అంతర్జాతీయంగా తెలుగు సినిమా పాట మరోసారి మారుమ్రోగింది. ప్రపంచ వ్యాప్తంగా డ్యాన్స్ షో అభిమానులకు ‘వరల్డ్ ఆఫ్ డ్యాన్స్’ రియాల్టీ షో గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే ఈ ఇంటర్నేషనల్ డ్యాన్స్ రియాలిటీ షోలో ఈ సారి ముంబైకి చెందిన డ్యాన్స్ గ్రూప్ `ది కింగ్స్` విజేతగా నిలిచింది. ఆసక్తికరమైన విషయమేమంటే ఫైనల్‌లో ‘ది కింగ్స్’ను విజేతగా నిలిపింది పవన్‌కల్యాణ్ `సర్దార్ గబ్బర్ సింగ్`లోని పాట కావడం విషేశం.
గతంలో చిరు ఖైదీ నెంబర్ 150లోని సుందరి అనే సాంగ్‌కి ఈ రియాల్టీ షోలో ఓ భారత డ్యాన్స్ గ్రూప్ డ్యాన్స్ చేసింది. ఇప్పుడు చిరు సోదరుడు పవన్ కళ్యాణ్ చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్‌లోని ‘వాడెవడన్నా వీడవెడన్నా సర్దార్ అన్నకు అడ్డెవరన్నా’ అనే సాంగ్‌కి అంతర్జాతీయ వేదికపై ‘ది కింగ్స్’ అనే భారత డ్యాన్స్ గ్రూప్ అదిరిపోయే స్టెప్పులు వేసి అలరించింది. ఈ డ్యాన్స్ వీడియోను ‘వరల్డ్ ఆఫ్ డ్యాన్స్’ తమ ట్విటర్ ఖాతాలో కూడా పోస్ట్ చేసింది.
ఈ సందర్భంగా దేవి శ్రీ తన సంగీత సారథ్యంలో రూపొందిన రెండు సాంగ్స్‌కి అంతర్జాతీయ షోలో ప్రదర్శన ఇవ్వడం థ్రిల్లింగ్‌గా ఉంది. నా సంగీతం ప్రజల్ని డ్యాన్స్ చేయించడం చాలా ఆనందంగా ఉంది. లవ్ యు గాయ్స్ మీరు ఎంతో చక్కగా డ్యాన్స్ చేశారు. కీప్ ‘రాకింగ్’ అని దేవి శ్రీ ప్రసాద్ తన ట్వీటర్ ద్వారా తెలిపారు. అంతేకాదు ఈ షోకి నిర్ణేతలుగా ఉన్న జెన్సీఫర్ లోపేజ్, డెరెక్ హూగ్ వారి డ్యాన్స్‌కి ఫిదా అయ్యారట.
At World Finals, this crew showed no mercy! ⚔️? pic.twitter.com/IopdvjqLDU
— World of Dance (@NBCWorldofDance) May 6, 2019