కరోనా లక్షణాలున్న వ్యక్తి పరార్‌.. ఏం జరిగిందంటే!

  • Published By: veegamteam ,Published On : March 6, 2020 / 09:01 AM IST
కరోనా లక్షణాలున్న వ్యక్తి పరార్‌.. ఏం జరిగిందంటే!

Updated On : March 6, 2020 / 9:01 AM IST

పంజాబ్‌లోని మోగాకు చెందిన ఓ వ్యక్తికి ఈ మధ్య దగ్గు బాగా రావడంతో ఆస్పత్రికి వెళ్లాడు. అయితే డాక్టర్లు అన్నీ టెస్టులు చేసిన ఆ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నటు చెప్పారు. దీంతో వెంటనే మీడియా వాళ్లు ఆ వ్యక్తిని ఫొటోలు తీస్తుండటంతో అతనికి భయంవేసి అక్కడి నుంచి పారిపోయాడు. 

వివరాలు.. డాక్టర్లు ఆ వ్యక్తికి కరోనా ఉందని చెప్పి ఐసొలేషన్‌ వార్డుకు తరలించే ఎర్పాట్లు చేస్తున్నారు. ఆ సమయంలో కరోనా లక్షణాలున్న వ్యక్తి అక్కడినుంచి పరారయ్యాడు. అతనెక్కడికి వెళ్లాడో తెలియక డాక్టర్లు చాలా టెన్షన్ పడ్డారు. తరవాత నెమ్మదిగా ఆలోచించి ఆ వ్యక్తి వివరాలను బట్టి అతని ఇంటికి వెళ్లి చూస్తే అతను అక్కడే ఉన్నాడు. 

దీంతో వెంటనే అక్కడికి ప్రత్యేక డాక్టర్ల బృందం, పోలీసులు వెళ్లి అతనిని నచ్చజెప్పారు. ఆ వ్యక్తి మళ్లగా వారి మాటకు గౌరవం ఇచ్చి మరికొన్ని పరీక్షల కోసం శాంపిళ్లు ఇవ్వడానికి అంగీకరించాడు. అంతేకాదు ఐసోలేషన్‌ వార్డుకు వెళ్లేందుకు కూడా ఒప్పుకోవడంతో డాక్టర్లంతా ఒక్కసారి ఊపరి పీల్చుకున్నారు.