బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని

బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ..ఢాకాలోని నేషనల్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తోన్న బంగ్లాదేశ్ "నేషనల్ డే"కార్యక్రమంలో పాల్గొన్నారు.

బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని

Pm Arrives At National Parade Ground With Sheikh Hasina

Updated On : March 26, 2021 / 5:02 PM IST

PM with Sheikh Hasina బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ..ఢాకాలోని నేషనల్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తోన్న బంగ్లాదేశ్ “నేషనల్ డే”కార్యక్రమంలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో కలిసి ప్రధాని మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రెండు రోజుల పర్యటన కోసం భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం(మార్చి-26,2021)ఉదయం బంగ్లాదేశ్ వెళ్లిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు బంగ్లాదేశ్​లోని వివిధ ప్రాంతాలను సందర్శించనున్నారు. కరోనా మహమ్మారి ప్రారంభమైన తర్వాత మోడీ వెళ్లిన తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. ఈ ఉదయం ఢాకా చేరుకున్న ప్రధాని మోడీకి.. ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా సాదర స్వాగతం పలికారు.

అనంతరం, ఢాకాలోని సావర్​లోని జాతీయ అమరవీరుల స్మారకాన్ని మోడీ సందర్శించారు. అమరులను స్మరించుకున్న ప్రధాని స్మారకం వద్ద ఓ మొక్క నాటారు. బంగ్లాదేశ్ దేశభక్తుల అమరవీరులకు నా హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నాను, వారు చేసిన గొప్ప త్యాగాలు ఈ గొప్ప దేశం యొక్క పుట్టుకకు దోహదపడ్డాయి అని మెమోరియల్ వద్ద సందర్శకుల పుస్తకంలో ప్రధాని మోడీ తన సందేశంలో తెలిపారు.

ఢాకాలోని హోటల్ కి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బంగ్లాదేశ్​లోని ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ లోని పలువురు నేతలతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. బంగ్లాదేశ్ విదేశాంగశాఖ మంత్రి ఏకే అబ్దుల్ మొమీన్ తో ఢాకాలో సమావేశమయ్యారు. ఇరు దేశాల సంబంధాల బలోపేతం సహా పలు అంశాలపై ఇరువురూ చర్చించుకున్నారు. అంతకుముందు, బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఫైటర్స్ “ముక్తిజోడాస్”ని ప్రధాని కలిశారు. వివిధ రంగాల్లో సత్తా చాటిన బంగ్లాదేశ్ యువ విజేతలతో ప్రధాని సమావేశమయ్యారు. బంగ్లాదేశ్ లోని 14పార్టీల కూటమి కన్వినర్, నేతలను ప్రధాని కలిశారు. వారితో పలు విషయాలను చర్చించారు.

 

M1

M1

M3

M3

M3

M3

M5

M5

8

8

M6

M6