లాక్‌డౌన్‌పై మోడీ కీలక నిర్ణయం రేపే..

లాక్‌డౌన్‌పై మోడీ కీలక నిర్ణయం రేపే..

Updated On : April 10, 2020 / 5:24 AM IST

ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి మరోసారి ప్రసంగించనున్నారు. కొద్ది రోజుల ముందు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫిరెన్స్ లో మాట్లాడిన మోడీ.. పొడిగింపుపై ఆలోచించాలని సూచించారు. మరోసారి వారందరిని కలిసి నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. మంగళవారంతో ముగియనున్న తొలి విడత లాక్‌డౌన్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

కొన్ని వర్గాల సమాచారం ప్రకారం.. లాక్‌డౌన్ పొడిగింపు అనివార్యం లాగే కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా పలు కీలక మార్పులు చేపట్టి ఆ తర్వాత పొడిగించే ప్లానింగ్ లో ఉన్నారట. మరోసారి అదే అత్యవసరసేవలు మినహాయించి స్కూళ్లు, కాలేజీలు, మతపరమైన సంస్థలు మూసే ఉంచుతారు. కరోనా వైరస్ భారత ఆర్థిక వ్యవస్థను స్వల్ఫ కాలంలోనే దెబ్బతీసిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబుతుంది. 

ఈ మహమ్మారి ప్రభావంతో ప్రథమంగా, ఘోరంగా దెబ్బతింది ఏవియేషన్ సెక్టారే. ఏప్రిల్ 15 నుంచి ఎయిర్ లైన్స్ మళ్లీ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారట. కొద్ది ప్రాంతాలకు మాత్రమే షరతులతో కూడిన సర్వీసులు నిర్వహించనున్నట్లు అధికారులు అంటున్నారు. 600జిల్లాలున్న భారత్‌ లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత 75పైనే ఫోకస్ పెడితే సరిపోతుందని భావిస్తుందట. 

ఒడిశాతో పాటు కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించేశాయి. మార్చి 25నుంచి నిర్వహించిన లాక్ డౌన్ ఏప్రిల్ 14న ముగుస్తుందో… పాక్షికంగా ఎత్తివేస్తారో రేపటి(శనివారం, ఏప్రిల్ 11) మీటింగ్ లో మోడీ నిర్ణయం తీసుకుంటారు.  భారత్‌లో 6వేల 412కేసులు నమోదుకాగా, 199మృత్యువాత పడ్డారు. గడిచిన 24గంటల్లో 33మంది ప్రాణాలు కోల్పోయారు.  (ఎలా జరిగింది : మంచినీళ్లు అనుకుని శానిటైజర్ తాగిన వైద్యాధికారి)