“145 Megapixel” Image Of Sun: సూర్యుడి 145 మెగాపిక్సెల్ ఫొటో తీసిన యువకుడు.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

ప్రత్యేకంగా రూపొందించిన టెలిస్కోప్‌ను ఉపయోగించి ఓ వ్యక్తి తీసిన సూర్యుడి ఫొటో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. సూర్యుడి ఫొటో చాలా స్పష్టంగా కనపడుతుండడమే దీనికి కారణం. ajamesmccarthy పేరిట రెడిట్ లో ఓ యూజర్ ఉన్నాడు. ‘మన సూర్యుడి 145 మెగాపిక్సెల్ ఇమేజ్ ను నేను తీశాను. ప్రత్యేకంగా రూపొందించిన టెలిస్కోపుతో దీన్ని తీశాను’ అని రెడిట్ లో పేర్కొన్నాడు. ఈ ఫొటోను అతడు షేక్ చేసిన కొన్ని నిమిషాల్లోనే వేలాది లైకులు, కామెంట్లు వచ్చాయి. లక్షలాది మంది ఈ ఫొటోను షేర్ చేస్తున్నారు.

“145 Megapixel” Image Of Sun: సూర్యుడి 145 మెగాపిక్సెల్ ఫొటో తీసిన యువకుడు.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

"145 Megapixel" Image Of Sun

Updated On : August 20, 2022 / 12:38 PM IST

“145 Megapixel” Image Of Sun: ప్రత్యేకంగా రూపొందించిన టెలిస్కోప్‌ను ఉపయోగించి ఓ వ్యక్తి తీసిన సూర్యుడి ఫొటో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. సూర్యుడి ఫొటో చాలా స్పష్టంగా కనపడుతుండడమే దీనికి కారణం. ajamesmccarthy పేరిట రెడిట్ లో ఓ యూజర్ ఉన్నాడు. ‘మన సూర్యుడి 145 మెగాపిక్సెల్ ఇమేజ్ ను నేను తీశాను. ప్రత్యేకంగా రూపొందించిన టెలిస్కోపుతో దీన్ని తీశాను’ అని రెడిట్ లో పేర్కొన్నాడు. ఈ ఫొటోను అతడు షేక్ చేసిన కొన్ని నిమిషాల్లోనే వేలాది లైకులు, కామెంట్లు వచ్చాయి. లక్షలాది మంది ఈ ఫొటోను షేర్ చేస్తున్నారు.

ఈ ఫొటోను తీసిన వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ‘నువ్వు నాసాలో పనిచేస్తున్నావా?’ అంటూ కొందరు కామెంట్లు చేశారు. ‘నేను నీ పోస్టుల్లోని ఫొటోలన్నింటినీ చూశాను.. చాలా బాగున్నాయి’ అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. సూర్యుడి ఫొటోను ఇంత స్పష్టంగా తీయడం ఎలా సాధ్యమైందని చాలా మంది అడుగుతున్నారు. శాస్త్రవేత్తలకు సాధ్యమయ్యే పనిని ఎలా చేశావంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. వేలాది మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటోను చాలా మంది షేర్ చేస్తుండడంతో అతడు ఫేమస్ అయిపోయాడు.

China-taiwan conflict: తైవాన్‌లో అస్థిరత తీసుకురావడానికి పనిచేస్తోన్న ఏజెంట్‌లా చైనా వ్యవహరించవద్దు: అమెరికా వార్నింగ్