భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 40 వేర్వేరు COVID వ్యాక్సిన్ల అభివృద్ధి.. వచ్చే 12-18 నెలల్లో కరోనా మందు రావొచ్చు!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ (Covid-19)ను నిర్మూలించే వ్యాక్సీన్ కోసం పరిశోధనలు అభివృద్ధి దశలో కొనసాగుతున్నాయి. 40 వేర్వేరు కరోనా (SARS-CoV2) వ్యాక్సీన్లను కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా రీసెర్చర్లు పరిశోధనలు చేస్తున్నారు. అందులో భారత్ కూడా ఒకటిగా ఉంది. Serum Institute of India కరోనా వ్యాక్సీస్ అభివృద్ధి చేస్తోంది. దీనికి సంబంధించి ఆర్టికల్ న్యూ ఇంగ్లాండ్ జనరల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించారు. ప్రస్తుతం రెండు మాత్రమే క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన విధానాలు విభిన్నంగా ఉన్నప్పటికీ, కరోనావైరస్ నిర్మూలనకు వ్యాక్సిన్ వచ్చే 12-18 నెలల్లో మాత్రమే లభిస్తుందని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ట్రయల్స్‌లో ఉన్న రెండు వ్యాక్సిన్లు Modernaకు చెందిన RNA వ్యాక్సిన్. ఈ నెల మొదట్లో యుఎస్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (NIAID)లో ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఇందులో ఒకటి చైనాలో అభివృద్ధి చేయగా.. హాంకాంగ్‌కు చెందిన CanSino Biologics వ్యాక్సీన్ కనిపెట్టే ప్రయత్నాలో ఉంది. ప్రస్తుతం రెండు మాత్రమే క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయని పేర్కొంది. ఈ వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన విధానాలు విభిన్నంగా ఉన్నప్పటికీ, కరోనావైరస్ నిర్మూలనకు వ్యాక్సిన్ వచ్చే 12-18 నెలల్లో మాత్రమే లభిస్తుందని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మొదటి వ్యాక్సిన్‌ను mRNA-1273 అని పిలుస్తారు. దీనిని USAలోని మసాచుసెట్స్‌లోని కేంబ్రిడ్జ్ కేంద్రంగా ఉన్న బయోటెక్నాలజీ సంస్థ మోడెర్నా, ఇంక్‌లో NIAID శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ ట్రయల్‌లో భాగంగా సుమారు 6 వారాలలో 18 నుండి 55 సంవత్సరాల మధ్య 45 మంది ఆరోగ్యకరమైన వయోజన వాలంటీర్లను నమోదు చేస్తారు. చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి అనుబంధంగా ఉన్న చైనా అకాడమీ ఆఫ్ మిలిటరీ మెడికల్ సైన్సెస్‌లో కాన్సినో వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఈ ట్రయల్‌లో మార్చి, డిసెంబర్ మధ్య 108 మందిని నియమించనున్నారు.
దీనికి హాంకాంగ్-లిస్టెడ్ బయోటెక్ సంస్థ కాన్సినో బయోలాజిక్స్ భాగస్వామ్యం ఇవ్వనున్నట్లు జర్నల్ పేర్కొంది. అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ అయిన Coalition for Epidemic Preparedness Innovations (CEPI)ను వెల్ కమ్ ట్రస్ట్, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, యూరోపియన్ కమిషన్ ఎనిమిది దేశాలు (ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, ఇథియోపియా, జర్మనీ, జపాన్, నార్వే, యుకె) కొత్త వైరస్ వ్యాక్సీన్ ప్రయోగంలో ప్రత్యేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.