ఓపక్క స్కాములు..మరో పక్క పేద విద్యార్దులకు ఫీజులు కట్టే ఆపద్భాంధవుడు..శిక్షించాలా? రక్షించాలా?

  • Published By: nagamani ,Published On : October 19, 2020 / 02:11 PM IST
ఓపక్క స్కాములు..మరో పక్క పేద విద్యార్దులకు ఫీజులు కట్టే ఆపద్భాంధవుడు..శిక్షించాలా? రక్షించాలా?

Updated On : October 19, 2020 / 2:27 PM IST

California Robert Smith : ప్రతీ మనిషిలోను మంచీ చెడులు కలిసి ఉంటాయి. ఆయా సందర్భాల్లో మంచి చెడులు బైటపడతాయని పెద్దలు అంటుంటారు. అలా ఓ వ్యక్తి ఓ వైపు మానవత్వం..విద్యాదాతగా పేరు..మరోవైపు కుంభకోణాలు చేసినట్లుగా ఆరోపణలు..ఓ వైపు ప్రభుత్వానికి పన్ను కట్టకుండా ఎగవేతలు..మరోవైపే పేద విద్యార్దులకు స్కూల్..కాలేజీ ఫీజులు కట్టే మహోన్నత వ్యక్తి గొప్ప పేరు.ఒకే మనిషిలో ఉండే ఈ లక్షణాలు అతను మంచివాడనాలా? లేక మోసగాడనాలా?అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే అతని గురించి తెలుసుకోవాల్సిందే..



ఆయన ఎవరో కాదు అమెరికాకు చెందిన ‘రాబర్ట్‌ స్మిత్‌’. ఈ పేరు చాలా మందికి తెలిసే వుంటుంది. ప్రైవేట్‌ ఈక్విటీ కంపెనీ విస్తా ఈక్విటీ పార్ట్‌నర్‌ను స్థాపించి ఉన్నత స్థాయికి ఎదిన వ్యక్తి.ఆయన ఈ ఉన్నతస్థాయికి ఎదగటమే కాదు మానవత్వాన్ని మరచిపోని గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించారు. ఎంతోమందికి సహాయపడ్డారు. గత సంవత్సరం మోర్‌ హౌస్‌ కాలేజీలో ఉన్న గ్రాడ్యుయేట్‌ విద్యార్థుల అందరి ఫీజులు చెల్లించి మానవత్వాన్ని చాటుకున్నారు.



ఇదిలా ఉంటే మరోపక్క స్మిత్‌ 15 ఏళ్లుగా వేలకోట్ల రూపాయల పన్ను ఎగ్గొటారని శాన్‌ఫ్రాన్సిస్కో ఆటర్నీ డేవిడ్‌ ఆండర్సన్‌ తెలిపారు. అమెరికాలోనే అత్యంత పన్ను ట్యాక్స్ కుంభకోణం రెండు బిలియన్‌ డాలర్ల కేసులో నేరస్తుడిగా ఉన్న రాబర్ట్‌ బ్రోక్‌మన్‌ కేసు విచారణలో స్మిత్‌ను కూడా విచారించారు. 2 బిలియన్ డాలర్ల కుంభకోణానికి సహకరించానని స్మిత్‌ ఒప్పుకోవటం మరో విశేషం.


గత 15 ఏళ్లుగా వివిధ రకాల ట్రస్ట్‌లు, కార్పొరేషన్ల ద్వారా ఫారెన్‌ ఫండ్స్ తప్పుదారి పట్టించిన స్మిత్ వాటి ట్యాక్స్‌ ఎగ్గొట్టినట్టు డేవిడ్‌ ఆండర్సన్‌ పేర్కొన్నారు. వీటికి సంబంధించి 139 మిలియన్‌ డాలర్లు చెల్లించడానికి ఒప్పుకున్నట్టు సమాచారం. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టే అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.