వారానికి ఒక్కసారైనా రొమాన్స్ చేస్తే…అకాల మరణాన్ని తప్పించుకోవచ్చు… కొత్త స్టడీ మాట

వారానికి ఒకసారి సెక్స్ చేస్తే అకాల మరణం నుంచి బయటపడవచ్చని స్టడీలు చెబుతున్నాయి. ఇది నిజమే. స్టడీల ప్రకారం.. వారానికి ఒకసారి సెక్స్ చేసేవాళ్లలో సెక్స్, గుండె జబ్బులు, మరే ఇతర కారణాలతో చనిపోయే వారు తక్కువగా ఉన్నట్లు స్టడీలు చెబుతున్నాయి.
సెక్స్ చేస్తే అంతే స్థాయిలో ఆరోగ్యకరమైన బెనిఫిట్లు వస్తాయని చెబుతున్నారు. 15వేల 269 మంది 39 ఏళ్ల లోపు వారిని సైంటిస్టులు పరీక్షలు జరిపారు. వారిని 11ఏళ్ల పాటు ట్రాక్ చేస్తూ ఉన్నారు. అందరిలో 72శాతం మంది నెలకోసారి సెక్స్ చేస్తుంటే 36శాతం మంది వారానికో సారి శృంగారం జరుపుతున్నారట.
స్టడీ జరుపుతుండగా చనిపోయిన 228మందిలో 29మంది గుండె జబ్బుల కారణంగా చనిపోతే 62 మంది క్యాన్సర్ ప్రభావానికి కన్నుమూశారు.
వాష్టింగ్టన్ యూనివర్సిటీ రీసెర్చర్స్ తరచుగా సెక్స్ చేసేవాళ్లు చనిపోయే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. సంవత్సరానికి ఓ సారి సెక్స్ చేసేవాళ్ల కంటే తరచూ చేసేవాళ్లలోనే చనిపోయే శాతం 49శాతం తక్కువగా ఉందట. సెక్స్ చేయడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగువుతుందట.