భలే మంచి ఐడియా : గర్భంతో ఉన్న గొర్రెకు ఇన్నర్ వేర్

  • Published By: veegamteam ,Published On : January 8, 2020 / 09:26 AM IST
భలే మంచి ఐడియా : గర్భంతో ఉన్న గొర్రెకు ఇన్నర్ వేర్

Updated On : January 8, 2020 / 9:26 AM IST

గర్భంతో ఉన్న గొర్రెకు లోదుస్తులు తొడిగి దాని ప్రాణాలు కాపాడిన ఐడియాకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. వాట్ యాన్ ఐడియా సార్..అంటున్నారు. గర్భంతో ఉన్న గొర్రెకు ఇన్నర్ వేర్ వేసిన ఈ ఫోటో  సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘బ్రా వేసుకున్నఈ గొర్రె పేరు ‘‘రోజ్’’. బ్రిటన్‌కు చెందిన ఫ్రాంక్‌లిన్ వెట్స్ లైఫ్‌స్టైల్ ఫార్మ్స్ సంస్థ పెట్టిన పోస్ట్ ఇది. 

గొర్రె పొదుగుకు బ్రాసియర్ తొడిగారు దాని యజమాని. ఎందుకంటే గొర్రె గాపడకుండా.ప్రస్తుతం ఈ గొర్రె (రోజ్)గర్భంతో ఉంది. ఈ క్రమంలో దాని పొదుగు చాలా పెద్దదిగా అయి నేలను తాకేలా ఉంది. గొర్రె కండరాలు తెగిపోవడం వల్ల ఇలా జరిగిందని, పరిస్థితిని ఇలాగే కొనసాగితే..గొర్రె గాయాలపాలయ్యే అవకాశం ఉంది. అందుకే ఆ మూగ జీవి ప్రాణాలు రక్షించేందుకే ఇలా చేయాల్సి వచ్చిందని వారు తెలిపారు.

గాయాలతో పరిస్థితి దిగజారితే గొర్రెకు కారుణ్యం మరణం ప్రసాదించాల్సి వచ్చేదని లైఫ్‌స్టైల్ ఫార్మ్స్ కూడా తెలిపారు. గర్భంతో ఉన్న ఆ మూగ జీవి ప్రాణాలు కాపాడటానికే ఇలా బ్రా తొడిగామాని తెలిపారు. ఈ ఫోటోలు చూసిన నెటిజన్టు లైఫ్‌స్టైల్ ఫార్మ్స్ సంస్థను పొగడ్తల్లో ముంచెత్తారు. మీరు చాలా గొప్ప మనస్సు గలవారు అంటూ ప్రశంసించారు. మీలాంటివారి ఆదరణ ఉన్న ఆ గొర్రె చాలా అదృష్టవంతురాలు అంటూ మరికొందరు ప్రశంసించారు.