ఆకాశం నుంచి ఉల్కల వాన..!! : కష్టాలు తీరతాయని మురిసిపోతున్న స్థానికులు..

ఈశాన్య బ్రెజిల్‌లోని మారుమూల పట్టణం అయిన శాంటా ఫిలోమెనాలో ఇటీవల ఆకాశంనుంచి ఉల్కలు జారిపడ్డాయి.అటు గ్రామం కాకుండా ఇటు పట్టణం కాకుండా చిన్నపాటి పట్టణంలా ఉంటుంది. ఆ శాంటా ఫిలోమెనాలో ఏదో ఒకటీరెండూ కాదు ఏకంగా వర్షంలా జారిపడ్డాయి. ఇది చూసి పట్టణ ప్రజలు ఆశ్చర్చపోయారు.
ఆ ఉల్కల విలువ తెలిసి తెగ సంబరపడిపోయారు. వారంతా రైతులు. అసలే కరోనా కష్టంకాలం పనులేవీ లేకపోవటం ఆహా..ఏమి మా భాగ్యము దేవుడే ఈ ఉల్కల్ని మన ఊరిలో జారిపడేలా చేశాడేమోనను తెగ ఆనంద పడిపడిపోతున్నారు. ఒక్కొక్క ఉల్క విలువ 26,000 డాలర్ల వరకు ఉంటుంది. అలాంటివి వందకుపైనే ఉల్కలు వర్షంలా పడ్డాయి. ఇంకేం వారి ఆనదానికి అంతులేదు..పైసలే పైసలు అనుకంటూ తెగ ఆనందపడిపోతున్నారు..
ఉల్కలు అంటే అంతరిక్షం నుంచి పడే చిన్న శిలలు. విస్ఫోటంలో చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి..సౌర వ్యవస్థలోని శూన్యంలో తిరుగుతుంటాయి. అవి సౌర వ్యవస్థ ప్రారంభం నాటి 4.6 బిలియన్ సంవత్సరాల పురాతన ఉల్కలో భాగంగా ఉండే ఈ ఉల్కలు భూమిదకు జారి పడటంతో అందులోనే తమ గ్రామంలో జారిపడేసరికి ఇక తమకు చేతిలో డబ్బులు బాగానే ఆడతాయని తమ కష్టాలు తీరిపోతాయని వారు ఆనందపడుతున్నారు.
అలా జారిపడ్డ ఉల్కల్ని శాంటా ఫిలోమెనా స్థానికులు ఒకచోట చేర్చారు. వాటిలో ఒక కఉల్క 40 కిలోలకంటే ఎక్కువ బరువు ఉంది.అయితే, ఈ ఉల్కలలో ఒక శాతం మాత్రమే ఈ రకానికి చెందినవి ఉంటాయి. వీటిపై పరిశోధన వీటిని అంతరిక్ష ప్రయోగాలు చేసే పరిశోధకులు కొనుక్కుంటారు. వీటి ధర గ్రామునకు 40 రియల్స్ (50 5.50) ఉంటుంది. అది డిమాండ్‌ను బట్టి రేటు కూడా పెరుగుతూంటుంది.
https://10tv.in/caught-on-cam-resolute-15-year-old-girl-wins-several-hearts-as-she-fights-snatchers-in-punjab/
40 కిలోల ఉల్కను కొనగలిగే బ్రెజిలియన్లు పెద్దగా ఉండరు. వాటిని ధనవంతులైన విదేశీయులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. శాంటా ఫిలోమెనాలో పడ్డ ఉల్కలు కొండ్రైట్ రకానికి చెందినవని, భూమికి ముందు సౌర వ్యవస్థలో ఏర్పడిన మొదటి ఖనిజాలలో ఒకటని సావో పాలో విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ప్రొఫెసర్ తెలిపాడు.