Spain Covid lockdown: లాక్‌డౌన్ ముగిసిందని వీధుల్లో పార్టీలు

వందల కొద్దీ జనం వీధుల్లో సెలబ్రేషన్స్, పార్టీలు జరుపుకున్నారు. స్పెయిన్ లో ఆరు నెలల పాటు జాతీయవ్యాప్తంగా ప్రకటించిన లాక్ డౌన్ ముగియడంతో శనివారం అర్ధరాత్రి సెలబ్రేట్ చేసుకున్నారు.

Spain Covid lockdown: లాక్‌డౌన్ ముగిసిందని వీధుల్లో పార్టీలు

Spain Covid Lockdown

Updated On : May 10, 2021 / 5:59 PM IST

Spain Covid lockdown: వందల కొద్దీ జనం వీధుల్లో సెలబ్రేషన్స్, పార్టీలు జరుపుకున్నారు. స్పెయిన్ లో ఆరు నెలల పాటు జాతీయవ్యాప్తంగా ప్రకటించిన లాక్ డౌన్ ముగియడంతో శనివారం అర్ధరాత్రి సెలబ్రేట్ చేసుకున్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి కొవిడ్ ఇన్ఫెక్షన్ రేట్ తగ్గడంతో స్పెయిన్ లో 17రీజియన్స్ కు కరోనావైరస్ నిబంధనల నుంచి రిలాక్సేషన్ ఇచ్చారు.

మాడ్రిడ్ సెంట్రల్ ప్యూయెర్టా డెల్ సొల్ స్క్వేర్ ప్రాంతంలో మాస్కులు లేకుండా డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ ఎంజాయ్ చేశారు. మహమ్మారి ముందు జరిపిన నైట్ లైఫ్ ను గుర్తు చేసుకుంటూ సెలబ్రేషన్స్ జరిగాయి.

బార్సిలోనాలో పోలీసులు చివరి కర్ఫ్యూ టైం 10గంటలకు మొదలవగానే అదుపుచేసినా అర్ధరాత్రితో ముగియగానే వదిలేశారు. చాలా మంది చేతుల్లో డ్రింక్ బాటిళ్లతో కనిపించారు.

స్పెయిన్ లో 17 రీజనల్ గవర్నమెంట్స్ హెల్త్ కేర్ పై ఫోకస్ పెట్టింది. పరిమితమైన స్వాతంత్ర్యం మాత్రమే ఇచ్చింది. నైట్ టైం కర్ఫ్యూలు, అత్యవసరం లేని ప్రాంతాలకు ప్రయాణాన్ని నిషేదించింది. క్రిష్టమస్ కోసం కొద్ది రోజులు మాత్రమే నిబంధనలు ఎత్తేసినా.. ఇతర ప్రాంతాలకు సెలవుపై, కుటుంబాలను చూడటానికి అనే కారణాలతో వెళ్లకూడదని ఆదేశించింది.

యూరప్ లో మహమ్మారి కారణంగా బలైన దేశాల్లో స్పెయిన్ ఒకటి. 3.5మిలియన్ మంది ఇన్ఫెక్షన్ కు గురికాగా, 79వేల మంది చనిపోయారు.