శ్రీలంకలో పేలుళ్ల దర్యాప్తు : ఆరుగురు అనుమానితుల ఫొటోలు రిలీజ్

శ్రీలంకలో పేలుళ్లకు పాల్పడి..వందల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న అనుమానితుల ఫోటోలను అక్కడి ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఆరుగురు అనుమానితులుగా గుర్తించారు. ఇందులో ముగ్గురు మహిళలున్నారు. వారి ఫొటోలతో కూడిన పోస్టర్లను ప్రధాన కూడళ్లలో అంటించారు. వీరి ఆచూకి తెలిస్తే వెంటనే ప్రభుత్వానికి సమాచారం అందివ్వాలని కోరింది. ఉగ్రవాదుల కోసం దేశ వ్యాప్తంగా గాలింపులు చేస్తున్నట్లు శ్రీలంక భద్రతా విభాగం వెల్లడించింది. ఇప్పటి వరకు 76 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐసీస్ సహకారంతో నేషనల్ తౌహీద్ జమాత్‌కు చెందిన 9 మంది సూసైడ్ బాంబర్లు పేలుళ్లకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
Also Read : బొమ్మ పడదు : పీఎం నరేంద్ర మోడీ బయోపిక్ మే 19 తర్వాతే
శ్రీలంక ప్రస్తుతం భయం గుప్పిట్లో బతుకుతోంది. నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్టీజే) అనే అతివాద సంస్థ ఈస్టర్ రోజున మారణకాండ సృష్టించిన సంగతి తెలిసిందే. మొత్తం ఆ సమయంలో 8 బాంబులు పేల్చారు ఉగ్రవాదులు. తర్వాత మరో రెండు బాంబులు పేలాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం లంక వాసుల్లో నెలకొంది. ముఖ్యంగా కొలంబో లాంటి కీలక పట్టణాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే జంకుతున్నారు.
ఇదిలా ఉంటే శ్రీలంక రక్షణ శాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో ఏప్రిల్ 25 గురువారం రాజీనామా చేశారు. నిఘా వర్గాలు ముందుగానే హెచ్చరించినా..శ్రీలంక ప్రభుత్వం ఆ దాడులను నివారించలేకపోయిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పోలీస్ చీఫ్, రక్షణ శాఖ సెక్రటరీని రాజీనామా చేయాలని దీంతో అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆదేశించారు.
Also Read : కాళ్లకు నమస్కరించి : మాయా బ్లెస్సింగ్స్ తీసుకున్న అఖిలేష్ భార్య