Sundar Pichai : తన మొదటి ఈ-మెయిల్ ఇంటరాక్షన్ గుర్తు చేసుకున్న సుందర్ పిచాయ్.. ఎవరికి పంపారంటే…
గూగుల్ CEO సుందర్ పిచాయ్ తన బ్లాగ్‌లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. గూగుల్ 25 వ పుట్టినరోజు సందర్భంలో తన తండ్రికి పంపిన మొదటి ఈ-మెయిల్ ఇంటరాక్షన్‌ను గుర్తు చేసుకున్నారు.

Sundar Pichai
Sundar Pichai : సెప్టెంబర్ 4 న గూగుల్ పుట్టినరోజు జరిగింది. 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంలో CEO సుందర్ పిచాయ్ తన బ్లాగ్‌లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. 25 సంవత్సరాల ప్రయాణంలో తన తండ్రికి పంపిన మొదటి ఈ-మెయిల్‌కి తన తండ్రి ఇచ్చిన ప్రత్యుత్తరాన్ని గుర్తు చేసుకున్నారు.
సెప్టెంబర్ 4 న గూగుల్ 25వ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంలో CEO సుందర్ పిచాయ్ తన బ్లాగ్‌లో పంచుకున్న విషయాలు వైరల్ అవుతున్నాయి. ఇన్ని సంవత్సరాల్లో సాకేతికంగా వచ్చిన మార్పులు, భవిష్యత్‌లో ఎలా ఉండబోతోందనే అంశాల గురించి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలో తన తండ్రికి చేసిన ఈ-మెయిల్ ఇంటరాక్షన్‌ను గుర్తు చేసుకున్నారు.
పిచాయ్ కొన్ని సంవత్సరాల క్రితం US లో చదువుతున్నప్పుడు తన తండ్రికి మొదటి ఈ-మెయిల్ పంపారట. ఆ తరువాత ఆయన నుంచి రిప్లై రావడానికి రెండు రోజులు పట్టిందట. ‘డియర్ మిస్టర్ పిచాయ్, ఈ-మెయిల్ వచ్చింది.. అంతా బాగానే ఉంది’ అని ఆయన తండ్రి సమాధానం ఇచ్చారట. తన రిప్లై ఎందుకు ఆలస్యమైందో కూడా పిచాయ్ తండ్రి ఆ మెయిల్‌లో రాసారట. తన తండ్రి ఆఫీసులో పిచాయ్ మెయిల్‌ను ప్రింట్ అవుట్ తీసి ఓ వ్యక్తి అతని తండ్రికి డెలివరీ చేసారట. తిరిగి ఆయన రాసి ఇచ్చిన దాన్ని టైప్ చేసి పిచాయ్‌కి మెయిల్ చేసారు. ఈ అంశంతో పాటు అప్పటికీ ఇప్పటికీ సాంకేతికంగా చోటు చేసుకున్న మార్పులను పిచాయ్ తన బ్లాగ్‌లో ఈ సందర్భంలో రాసుకొచ్చారు. తమ సంస్థ 25వ పుట్టినరోజు సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేసారు.
గూగుల్ సెప్టెంబర్ 4, 1998 లో లారీ పేజ్, సెర్గీ బ్రిన్ స్ధాపించారు. గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజన్‌గా మారడానికి అనేక మార్పులు జరిగాయి. 2004 లో కంపెనీలో చేరిన సుందర్ పిచాయ్ 2015 లో లారీ పేజ్ స్ధానంలో సీఈవోగా బాధ్యతలు చేపట్టారు.
Kicking off our 25th bday with a huge thanks to all the people + businesses using our products around the world. Been reflecting on the questions that got us here, and the search for answers that will drive extraordinary progress over the next 25 years ?https://t.co/pXbB8YJYPd
— Sundar Pichai (@sundarpichai) September 6, 2023