Afghanistan : కాబుల్ ఎయిర్ పోర్ట్‏లో భారతీయుల కిడ్నాప్

150 మంది భారతీయులు తాలిబన్ల చేతిలో బందీలుగా ఉన్నట్లు సమాచారం. వీరిలో కొంతమందిపై దాడి చేసినట్లు తెలుస్తుంది.

Afghanistan : కాబుల్ ఎయిర్ పోర్ట్‏లో భారతీయుల కిడ్నాప్

Afghanistan (2)

Updated On : August 21, 2021 / 1:23 PM IST

Afghanistan : కాబుల్ ఎయిర్ పోర్ట్ లో తాలిబన్లు 150 మంది భారతీయులను బంధించినట్లు తెలుస్తోంది. C-17 విమానంలో ఇండియాకు వచ్చేందుకు సిద్ధమవుతుండగా.. తాలిబన్లు వీరిని బందిచినట్లుగా వార్తలు వస్తున్నాయి. వీరిలో కొంతమందిపై దాడి చేసినట్లు తెలుస్తుంది. ఇక ఇతర దేశాలకు చెందిన పౌరులను కూడా తాలిబన్లు కిడ్నాప్ చేశారు. తాలిబన్లు కిడ్నాప్ చేసిన వారిలో భారతీయులే అధికంగా ఉన్నట్లు సమాచారం.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సి -130 జె ట్రాన్స్‌పోర్ట్ విమానం కాబూల్ నుండి 85 మంది భారతీయులను తరలించిన కొన్ని గంటల తర్వాత ఈ అపహరణ జరిగింది.
వీరంతా C-17 విమానంలో ఇండియాకు వచ్చేందుకు సిద్ధమవుతుండగా కిడ్నాప్ చేసినట్లు సమాచారం.

 

ఆఫ్ఘానిస్తాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిన నాటి నుంచి అక్కడ అరాచకాలు మొదలయ్యాయి. అమాయకులపై దాడులు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వానికి సహకరిస్తున్న అధికారులను కాల్చి చంపుతున్నారు. మీడియాలో పనిచేసే మహిళలపై ఒత్తిడి తెస్తున్నారు. తాలిబన్లకు బయపడి దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు ఆ దేశ పౌరులు. మరో వైపు తమ పిల్లలను రక్షించాలని విదేశీ సైన్యాలను వేడుకుంటున్నారు. తమ తరం పోయిన పర్వాలేదు తమ పిల్లలు బాగుండాలంటే ఇక్కడి నుంచి వారిని తరలించాలని వేడుకుంటున్నారు అఫ్ఘాన్ ప్రజలు

కిడ్నాప్ వ్యవహారంపై తాలిబన్లు స్పందించారు. తాము ఎవరిని కిడ్నాప్ చేయలేదని, భారతీయులకి రక్షణ కల్పించి కాబుల్ విమానాశ్రయానికి తరలించామని చెబుతున్నారు. ప్రయాణికులు తమను చూసి సేఫ్టీ గేటు నుంచి పారిపోయేందుకు యత్నిస్తుండగా వారిని అడ్డుకున్నామని తెలిపారు.