Taliban asks India: భారత్ సాయాన్ని కొనసాగించాలని తాలిబాన్ల రిక్వెస్ట్
అప్ఘానిస్తాన్ లో ఇరుక్కుపోయిన వారిని తీసుకొచ్చేందుకు న్యూ ఢిల్లీ ప్రణాళికలతో సహా రెడీ అయింది. కొందరినీ ఇండియాకు చేర్చిన తర్వాత

Taliban Asks India
Taliban asks India: అప్ఘానిస్తాన్ లో ఇరుక్కుపోయిన వారిని తీసుకొచ్చేందుకు న్యూ ఢిల్లీ ప్రణాళికలతో సహా రెడీ అయింది. కొందరినీ ఇండియాకు చేర్చిన తర్వాత తాలిబాన్ లీడర్ షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానెజై నుంచి సర్‌ప్రైజ్ రిక్వెస్ట్ వచ్చింది. ఇండియా నుంచి తమకు దౌత్యపరమైన సాయం కొనసాగించలేరా అంటూ రిక్వెస్ట్ వచ్చింది. ఖతర్ లోని గ్రూప్ పొలిటికల్ ఆఫీస్.. తాలిబాన్ నాయకుడి నుంచి అలా రావడం అనూహ్యంగా భావిస్తున్నారు.
అంతకుముందే ఇండియా ఎన్వాయ్, డిప్లొమ్యాట్స్, సెక్యూరిటీ పర్సనల్, సిటిజన్స్ దాదాపు 200 మందిని రెండు మిలటరీ ఫ్లైట్లలో సోమవారం, మంగళవారం ఖాళీ చేయించింది.
తాలిబాన్ నాయకుల టీంలో రెండో వ్యక్తిగా ఉన్న స్టానె.. గత అఫ్ఘానిస్తాన్ లో కీలకంగా ఉన్న విషయాన్ని గమనించి ఈ మెసేజ్ పంపారు. న్యూ ఢిల్లీ, కాబుల్ లో ఉన్న భారత అధికారులు ఈ విషయంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఆగష్టు 15ఆదివారంతో అధికారం చేజిక్కించుకున్న తాలిబాన్లు సెక్యూరిటీ సిచ్యుయేషన్ లో ఇండియా సాయం కావాలని అడిగింది. కాకపోతే అఫ్ఘానిస్తాన్ లోని కాబుల్ లో మిషన్, డిప్లొమేట్స్ భద్రత విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
ప్రత్యేకించి పాకిస్తాన్ కు చెందిన లష్కరె ఏ తైబా, లష్కరె జాంగ్వీ నుంచి ఫైటర్లను సెలక్ట్ చేసి ఎయిర్ పోర్టుకు వెళ్లే చెక్ పోస్ట్ వద్ద పహారా చేయిస్తున్నారు. అంటే దాదాపు వారంతా తాలిబాన్ల ఆదేశాలతో పనిచేస్తున్నట్లే.
ఇంగ్లీష్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్తాన్ కు చెందిన లష్కరె తోయిబా, హఖ్ఖానీ నెట్ వర్క్ రెండు టెర్రర్ గ్రూపులు కలిసి.. కాబుల్ లోకి ఎంటర్ అయ్యారు. తాలిబాన్ ఫైటర్ల సాయంతో అష్రఫ్ ఘనీ ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. దీంతో అక్కడ ఉన్న డిప్లమేట్స్ కు, ఇతర అధికారులకు భద్రత కల్పించే అవకాశం లేకపోవడంతో వారిని ఇండియా తీసుకొచ్చేయాలని ప్రధాని మోదీ ఆదేశాలిచ్చారు.