Terror Attack: పాక్‌లో ఉగ్రదాడి.. 11 మంది సైనికులు మృతి!
పాకిస్తాన్‌లో మరోసారి టెర్రరిస్టులు రక్తపాతం సృష్టించారు. ఖైబర్ పంక్తువా ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు దాడులు జరపగా పాకిస్తాన్ ఆర్మీకి చెందిన కెప్టెన్ స్థాయి అధికారితో పాటు మరో 11 మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికులు చనిపోయారు. ఉగ్రదాడిలో చనిపోయిన కెప్టెన్‌ను అబ్దుల్ బాసిత్‌గా గుర్తించగా..

Terror Attack
Terror Attack: పాకిస్తాన్‌లో మరోసారి టెర్రరిస్టులు రక్తపాతం సృష్టించారు. ఖైబర్ పంక్తువా ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు దాడులు జరపగా పాకిస్తాన్ ఆర్మీకి చెందిన కెప్టెన్ స్థాయి అధికారితో పాటు మరో 11 మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికులు చనిపోయారు. ఉగ్రదాడిలో చనిపోయిన కెప్టెన్‌ను అబ్దుల్ బాసిత్‌గా గుర్తించగా.. ముష్కరుల దాడిలో మరో 15 మంది సైనికులు కూడా గాయపడినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి.
ఇక, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దాడి అనంతరం కూడా మరికొందరు సైనికులు సైనికుల చెరలో ఉన్నట్టు తెలుస్తోంది. దాడి జరిగిన ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో కెప్టెన్ బాసిత్ నేతృత్వంలోని బృందం గాలింపు చేపట్టిన నేపథ్యంలో టెర్రరిస్టులు సైనికులపై మెరుపుదాడి చేశారు. ఈ క్రమంలోనే భారీ స్థాయి ఆర్మీకి నష్టం జరిగినట్లు తెలుస్తుంది.
ఒక కెప్టెన్, మరో 11 మంది సైనికులు చనిపోగా మరో 15 మంది గాయపడ్డారు. ప్రస్తుతం ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు జవాన్లు భారీ సంఖ్యలో రంగంలోకి దిగగా.. ముష్కరులు నక్కి ఉన్న చోట కాల్పులు జరపడంతో ముగ్గురు టెర్రరిస్టులు చనిపోయినట్టు పాకిస్తాన్‌కు చెందిన వార్తా సంస్థ తెలిపింది.