Pakistan Train Hijack : పాకిస్థాన్‌లో రైలు హైజాక్.. 450 మందిని కిడ్నాప్ చేసిన బలూచ్ రెబల్ గ్రూప్..!

ఈ హైజాక్ తో పాకిస్తాన్ ఒక్కసారిగా వణికిపోయింది. ఈ చర్యని తామే చేసినట్లు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.

Pakistan Train Hijack : పాకిస్థాన్‌లో రైలు హైజాక్.. 450 మందిని కిడ్నాప్ చేసిన బలూచ్ రెబల్ గ్రూప్..!

Updated On : March 11, 2025 / 6:26 PM IST

Pakistan Train Hijack : పాకిస్థాన్ లో కలకలం రేగింది. రైలును హైజాక్ చేశారు. బలూచ్ రెబల్ గ్రూప్ ఈ పని చేసింది. జాఫర్ ఎక్స్ ప్రెస్ ను పట్టాలు తప్పించి అదుపులోకి తీసుకున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 450 మందిని కిడ్నాప్ చేసినట్లు సమాచారం. అయితే, వంద మంది పాక్ భద్రతా సిబ్బంది తమ అదుపులో ఉన్నారని ప్రకటించింది రెబల్ గ్రూప్. తమపై సైనిక చర్య తీసుకుంటే బందీలను చంపేస్తామంటూ హెచ్చరించింది.

బలూచిస్థాన్ ను దేశంగా ప్రకటించాలని ఎప్పటినుంచో అక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీ డిమాండ్ చేస్తోంది. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతోంది. అక్కడ అలజడి రేపుతోంది. ఇదే క్రమంలో భద్రతా బలగాలపై దాడులు చేసింది. ఇదే క్రమంలో భద్రతా బలగాలపై దాడులు చేసింది. మానవ బాంబులను కూడా ప్రయోగించింది. ఈసారి ఏకంగా ట్రైన్ ని హైజాక్ చేయడం సంచనలంగా మారింది.

Also Read : “ఎక్స్‌”పై సైబర్‌దాడి వారి పనే..!: ఎలాన్‌ మస్క్‌

పక్కా ప్లాన్ తో మష్కఫ్, దాదర్, బొలాన్ ప్రాంతాల్లో మెరుపు దాడులు చేశారు బెలూచ్ మిలిటెంట్లు. జాఫర్ ఎక్స్ ప్రెస్ ను పట్టాలు తప్పించి తమ అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ ను గాయపరిచి 450 మంది ప్రయాణికులను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో సెలవుపై వెళ్తున్న ఆర్మీ, పోలీస్, యాంటీ టెర్రరిజం ఫోర్స్, ఐఎస్ఐ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా సెలవుపై పాకిస్తాన్ లోని పంజాబ్ వెళ్తుండగా ఈ దాడి జరిగినట్లుగా సమాచారం.

ఈ హైజాక్ తో పాకిస్తాన్ ఒక్కసారిగా వణికిపోయింది. ఈ చర్యని తామే చేసినట్లు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. తమ అదుపులో 100 పాకిస్తాన్ భద్రతా సిబ్బంది ఉన్నారని, సైనిక చర్య చేపడితే వారిని హతమారుస్తామని హెచ్చరించింది. బెలూచిస్తాన్ గవర్నమెంట్ బందీలను విడిపించేందుకు ప్రయత్నిస్తోంది. మిలిటెంట్లతో సంప్రదింపులు జరిపేందుకు మార్గాలు అన్వేషిస్తోంది. అయితే, బందీలుగా ఉన్న వారికి ఏం జరిగింది అనేది ఉత్కంఠగా మారింది. వారి గురించి ఎలాంటి సమాచారం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

Also Read : భవిష్యత్తులో మనం బొద్దింక పాలను తాగుతామా? ఆవు పాల కంటే బెటర్‌.. అంతేకాదు..

జాఫర్ ఎక్స్ ప్రెస్ లో మొత్తం 9 బోగీలు ఉన్నాయి. రైలు పాకిస్తాన్ సౌత్ వెస్ట్రన్ బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని క్వెట్టా నుంచి పెషావర్ కు వెళ్తోంది. బలూచ్ మిలిటెంట్లు రైల్వే ట్రాక్ లను పేల్చేసి ట్రైన్ ను ఆపేలా చేసినట్లు తెలుస్తోంది.

”ఏదైనా సైనిక చర్యకు దిగితే అంతే బలమైన ప్రతిస్పందన ఉంటుంది. ఇప్పటివరకు, ఆరుగురు సైనిక సిబ్బంది మరణించారు. వందలాది మంది ప్రయాణికులు బెలూచ్ లిబరేషన్ ఆర్మీ అదుపులో ఉన్నారు. ఈ ఆపరేషన్‌కు బలూచ్ లిబరేషన్ ఆర్మీ పూర్తి బాధ్యత తీసుకుంటుంది” అని బీఎల్ఏ ప్రతినిధి సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రకటనలో తెలిపారు. మరోవైపు బలూచిస్తాన్‌లోని బోలాన్ జిల్లాలోని ముష్కాఫ్ ప్రాంతంలో జరిగిన సంఘటనా స్థలానికి భద్రతా దళాలు చేరుకున్నాయని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.