రియల్ ఏంజెల్స్: ప్రమాదమైనా పట్టించుకోట్లేదు.. కరోనా బాధితుల కోసం వైద్యులు

  • Published By: vamsi ,Published On : February 7, 2020 / 08:39 AM IST
రియల్ ఏంజెల్స్: ప్రమాదమైనా పట్టించుకోట్లేదు.. కరోనా బాధితుల కోసం వైద్యులు

Updated On : February 7, 2020 / 8:39 AM IST

కరోనా వైరస్ ప్రపంచాన్ని కంగారు పెట్టేస్తుంది. కరోనా దెబ్బకు గజగజా వణికిపోతున్నారు ప్రజలు. చైనాలో అయితే దీని ప్రభావం విపరీతంగా ఉంది. ఇప్పటికే 28దేశాల్లో దీని ఛాయలు కనిపిస్తుండగా.. చైనా మాత్రం వ్యాధి కారణంగా అస్తవ్యస్తం అవుతుంది. 

చైనాలో కరోనావైరస్ సోకినవాళ్లకు వైద్యం చేస్తున్న డాక్టర్లు, నర్సులు పరిస్థితి అయితే మరీ దయనీయంగా మారింది. వ్యాధి సోకినవారికి సపర్యలు చెయ్యడానికి వారు ప్రత్యేక మైన మాస్కులు, బ్లౌజ్‌లు ధరిస్తున్నారు. వైరస్ నుండి తమను తాము రక్షించుకోవడానికి ముసుగులు ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల వారి ముఖాలపై గుర్తులు ఏర్పడుతున్నాయి.

Corona

      వారికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రాణాలను లెక్కచేయకుండా కరోనా వైరస్ వ్యాధిగ్రస్తులకు చికిత్స చేస్తున్న వారిని ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. వైద్య సిబ్బందిని “హీరోలు” అని పిలుస్తున్నారు అందరూ. చైనాలో వుహాన్ కేంద్రంగా ఉన్న వైద్య సిబ్బంది ఫోటోలు షేర్ చేస్తున్నారు. Corana

అయితే ఆ ఫోటోలను చూస్తే పాపం అనాల్సిందే. కొంతమందికి ఎక్కువసేపు మాస్క్ లు పెట్టుకోవడం వల్ల మొఖానికి గాయాలు కూడా అయ్యాయి. అంతే కాదు వారి మొఖం మొత్తం దారుణంగా గాయాలు అయినట్లే కనిపిస్తుంది.