ఆయన స్టైలే వేరు : ట్రంప్ దెబ్బకు పేరు మార్చుకున్న ఆపిల్ సీఈవో

ట్రంప్ ఏది చేసినా వెరైటీగానే ఉంటుంది. ఆయన నోటిలో నుంచి ఏదైనా బయటకు వస్తే అది సంచలనమే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాగే ట్రంప్ నోరు జారడంతో చివరకు ఆపిల్ సీఈవోనే తన పేరు మార్చుకోవాల్సి వచ్చింది. టిమ్ కుక్..ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రఖ్యాత ఆపిల్ కంపెనీకి సీఈవోగా ప్రపంచానికి ఆయన సుపరిచితులు. అయితే ట్రంప్ చేసిన ఓ పని ఆయనకు పెద్ద తంటాలు తెచ్చి పెట్టింది.
Also Read : టాక్ ఆఫ్ ది టౌన్ : చిలుక పట్టి తెస్తే.. రూ.20 వేలు రివార్డు
బుధవారం(మార్చి-6,2019) ఓ సమావేశంలో ఆపిల్ సీఈవో టిమ్ కుక్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్నారు. ఈ సమయంలో ట్రంప్ ఆపిల్ సీఈవో గురించి మాట్లాడుతూ పదే పదే టిమ్ ఆపిల్..టిమ్ ఆపిల్ అని తప్పుగా పలికారు. దీంతో టిమ్ మాత్రమే కాకుండా అక్కడున్నవాళ్లందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే తన రేంజ్ ని గుర్తిస్తూ ట్రంప్ అలా చమత్కరించాడని గ్రహించిన టిమ్ ట్రంప్ ని హగ్ చేసుకున్నాడు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సమావేశం అనంతరం టిమ్ కూడా తన ట్విట్టర్ ఫ్రొఫైల్ లో మార్పులు చేశారు.ఫ్రొఫైల్ నేమ్..టిమ్ తో పాటు ఉన్న ఆపిల్ సింబల్ ని యాడ్ చేశారు. టిమ్ చర్యపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. అలాగే ట్రంప్ తీరుపై నెటిజన్లు ఫన్నీగా సెటైర్లు వేస్తున్నారు. ట్రంప్ చెబితే అంతే అంటూ పన్నీగా పోస్ట్ లు పెడుతున్నారు. ట్రంప్ గతంలో కూడా పలువురు ప్రముఖుల పేర్లను మార్చి పలికిన విషయం తెలిసిందే.
Also Read : అద్బుతం జరిగింది : 118 ఏళ్ల బామ్మకు గుండె ఆపరేషన్
Also Read : Sky for ALL : @ 799లకే విమాన టికెట్