Canadian Student : ‘భారతదేశాన్ని విడిచిపెట్టడం తన కల’ అన్న అమ్మాయికి జాబ్ ఆఫర్ ఇచ్చిన ట్రూ కాలర్ సీఈవో

ఇండియాను విడిచిపెట్టి విదేశాల్లో స్థిరపడటం తన కల అంటూ మాట్లాడిన ఓ యువతి ఈ మధ్య దారుణంగా ట్రోల్‌కు గురైంది. ఈ నేపథ్యంలో ట్రూ కాలర్ సీఈవో ఆమెకు జాబ్ ఆపర్ ఇస్తూ ట్వీట్ చేయడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

Canadian Student : ‘భారతదేశాన్ని విడిచిపెట్టడం తన కల’ అన్న అమ్మాయికి జాబ్ ఆఫర్ ఇచ్చిన ట్రూ కాలర్ సీఈవో

Canadian Student

Updated On : August 4, 2023 / 4:37 PM IST

Canadian Student : ‘డ్రీమ్ టు లీవ్ ఇండియా’ అని చెప్పిన ఓ యువతి రీసెంట్‌గా ట్రోల్‌కి గురైంది. అయితే ట్రూ కాలర్ సీఈవో ఆమెకు  జాబ్ ఆఫర్ ఇచ్చారు. ట్రోల్స్‌ని పట్టించుకోవద్దని ఆమె సూచిస్తూ ట్వీట్ చేయడం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

ట్రూ కాలర్‌కి కాల్ రాబోతుందని ఎలా తెలుస్తుంది?

ఏక్తా అనే భారతీయ యువతి కెనడాలో బయోటెక్నాలజీ చదువుకుంటోంది. ఇటీవల ఓ వైరల్ క్లిప్‌లో ‘కెనడాకు ఎందుకు వచ్చారు? ‘ అనే ప్రశ్నకు ‘భారత్ ను విడిచి వెళ్లాలనేది తన కల’ అంటూ ఆ క్లిప్‌లో ఆమె మాట్లాడింది. ఇది చూసిన నెటిజన్లు ఆమెపై విపరీతంగా ట్రోల్ చేశారు. ఆన్ లైన్‌లో అనేక చర్చలు జరిగి ఆమె సెన్సేషన్‌గా మారింది.

 

ఇంకా ఈ వీడియోలో ఏక్తా ఇండియాలో అందమైన దృశ్యాలు, సూర్యోదయం, సూర్యాస్తమయం అంటే ఇష్టమని చెప్పింది. సోషల్ మీడియాలో ఆమె వీడియోకు నెగెటివ్ కామెంట్లు వచ్చాయి. ఇలాంటి సమయంలో ఆమెకు ట్రూ కాలర్ సీఈవో అలాన్ మామెడి జాబ్ ఆఫర్ ఇచ్చారు. ఆ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ నుంచి పోస్ట్ చేయడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

Twitter X Blue Ticks : ట్విట్టర్ (X) పెయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్.. ఇకపై ‘బ్లూ టిక్’ హైడ్ చేసుకోవచ్చు..!
అలాన్ మామెడి (@AlanMamedi) ‘ప్రజలు నిజంగా ఆమెను అపార్ధం చేసుకుని ఎగతాళి చేయాలనుకుంటున్నారు. ఇది సరి కాదు. ఏక్తా వాటిని నువ్వు పట్టించుకోకు. ఎగతాళి చేయడం వినకు. నువ్వు కూల్‌గా నీ కలలు నిజం చేసుకుంటావని భావిస్తున్నాను. నీ చదువు పూర్తైన తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా కార్యాలయాలలో దేనిలోనైనా Truecaller లో పనిచేయడానికి మీకు స్వాగతం’ అని ట్యాగ్ చేస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అలాన్ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు అతనికి మద్దతు ఇస్తుంటే కొందరు విమర్శించారు.