“వైల్డ్ హెయిర్” అంటూ.. సునీతా విలియమ్స్ గురించి ట్రంప్ కామెంట్స్.. ఆమె జుట్టుని ఇలా అన్నారేంటి?
బైడెన్‌పై ట్రంప్ విమర్శలు గుప్పించారు.

Donald Trump, Sunita Williams
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ను తిరిగి భూమి మీదకు తీసుకువస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
స్పేస్‌లో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ ఇప్పుడు కనపడుతున్న తీరును గురించి ట్రంప్ మాట్లాడుతూ.. “వైల్డ్ హెయిర్ (అసహజ జుట్టుతో) ఉన్న మహిళను చూశాను.. గుడ్.. ఆమె జుట్టు బాగానే ఉంది.. నేనేం తమాషా చేయడం లేదు.. ఆమె జుట్టుతో గేమ్స్ ఆడడం లేదు” అని వ్యాఖ్యానించారు.
ఓవల్ ఆఫీస్‌లో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ… “స్పేస్‌లో ఇద్దరు వ్యోమగాములు చిక్కుకుపోయారు. వారిని తీసుకువస్తారా? అని నేను ఎలాన్ మస్క్‌ను అడిగాను. తీసుకురాగలమని ఎలాన్ మస్క్ చెప్పారు. రెండు వారాల్లో ఇది పూర్తి కావచ్చు” అని చెప్పారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ను భూమి పైకి తీసుకువచ్చే ప్రక్రియను కొనసాగిచేందుకు గత జో బైడెన్ ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాలూ చేయలేదని ట్రంప్ అన్నారు.
“వారిని బైడెన్ అక్కడే ఉండిపోయేలా చేశారు. కానీ ఈ అధ్యక్షుడు మాత్రం అలా చేయడు. వారికి కిందకు తీసుకువస్తాం. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్.. మిమ్మల్ని తీసుకువచ్చేందుకు మేము వచ్చేస్తున్నాం” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. గత బైడెన్ ప్రభుత్వం చేసిన ఆలస్యం కారణంగా అమెరికా వ్యోమగాములు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
కాగా, సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమి మీదకు తొమ్మి నెలల తర్వాత వస్తున్నారు. వారిద్దరు ఈ నెల 19న భూమి మీదకు వస్తారని నాసా ఇప్పటికే ప్రకటించింది. నాసా, స్పేస్ ఎక్స్ చేపట్టిన క్రూ-9 మిషన్‌ను ఇప్పటికే అంతరిక్ష కేంద్రానికి పంపించారు. దీని ద్వారానే తిరిగి భూమి మీదకు రానున్నారు. క్రూ-9 సిబ్బందిని రిలీవ్ చేసేందుకు వెళ్లే క్రూ-10 ప్రయోగం మార్చి 12న జరగనుంది.